నేటి కాలంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. దాని కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. పైసా పైసా కూడబెడుతున్నారు. కానీ పెరుగుతున్న ప్రాపర్టీ ధరల వల్ల మధ్యతరగతి వర్గాల వారికి సొంతిళ్లు కల ఇబ్బందిగా మారుతోంది. ఇక పెద్ద నగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు ఇల్లు అద్దెకు తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే..అమెరికా, న్యూయార్క్ కంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌లో గుర్గావ్‌లోని ఆస్తుల ధరలు, అమెరికా న్యూయార్క్‌లోని ఆస్తి ధరలకు సంబంధించి ఆసక్తికరమైన పోలిక చేశారు. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, న్యూయార్క్ వంటి పెద్ద నగరంలో ఆస్తి రేట్లు గుర్గావ్ కంటే తక్కువగా ఉన్నాయి. గుర్గావ్‌లోని ఫ్లాట్‌తో సమానమైన ధరకు న్యూయార్క్‌లో విల్లా అందుబాటులో ఉందని ఈ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది.
ఈ పోస్ట్‌ను మేనేజ్‌మెంట్ అడ్వైజర్ గుర్జోత్ అహ్లువాలియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. తన పోస్ట్‌లో, గుర్గావ్‌లోని DLF మాగ్నోలియాస్‌లోని 4BHK లేదా 5BHK ఫ్లాట్‌ల ధర న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని 6BHK పెంట్‌హౌస్‌కి సమానం అని చెప్పారు. మీ వద్ద 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 25 కోట్లు) ఉంటే, మీరు ఎక్కడ ఇల్లు కొనాలనుకుంటున్నారు? న్యూయార్క్‌లోనా లేదంటే, గురుగ్రామ్‌లోనా అనే ప్రశ్న కూడా వేశారు.
Which $3M apartment would you prefer?
• Gurgaon or New York?
• 4BHK Flat or 6BHK Penthouse?
• Golf Course Road or Manhattan?
• Cyber City or Times Square?
• Magnolias Park or 3.4 sqkm Central Park?IMO REAL Estate is a SCAM in India! pic.twitter.com/jNlPCm7fjK
— Gurjot Ahluwalia (@gurjota) October 27, 2024
మాగ్నోలియాస్ అపార్ట్‌మెంట్లలో ఇంటితో పాటు స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్, గ్రీన్ గార్డెన్, కవర్ పార్కింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు మీకు లభిస్తాయని గుర్జోత్ తన పోస్ట్‌లో రాశారు. మీరు న్యూయార్క్‌లో అదే మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తే, మీకు 6BHK లగ్జరీ అపార్ట్మెంట్ మాత్రమే లభిస్తుంది. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, అది దావానంలా వ్యాపించింది. ప్రజలు దానిపై పెద్ద సంఖ్యలో స్పందించారు. దేశంలో తదుపరి స్కామ్ ఆస్తికి సంబంధించి మాత్రమే జరగబోతోందంటూ ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. ఇక్కడ ప్రజలు తమ ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని మరొకరు రాశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..