Group of people save cow life: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి గంటకు మిలియన్ల కొద్దీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వీడియోలను చూసి చాలా సార్లు నవ్వుకోవడంతోపాటు ఆశ్చర్యపోతుంటాం.. ఇదేకాకుండా హృదయాన్ని హత్తుకునే వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన తర్వాత ప్రపంచం ఎంత చెడిపోయినా బతికించేందుకు.. మానవత్వాన్ని కాపాడేందుకు కొంతమంది వ్యక్తులు ఉన్నారని అర్థమవుతుంది. తల్లితండ్రులు ఇచ్చిన సంస్కారం వల్లే వారిలో మానవత్వం కలకాలం నిలిచిపోతుందని పేర్కొంటుంటారు. వీడియోలో పర్వతం మీద నుంచి ఒక ఆవును రక్షించడానికి కొంతమంది వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వీరంతా కలిసి ఈ రెస్క్యూ పనిని విజయవంతం చేశారు. ఇక్కడ రక్షకులు వరుసలో నిలబడి.. కొండ ప్రాంతం నుంచి కిందపడిన ఆవుకు తాడు కట్టి పైకి లాగారు. అలా ప్రాణాలను పణంగా పెట్టి మరి గోమాత ప్రాణాలను కాపాడారు. వీడియోను పోస్ట్ చేసిన ట్విట్టర్ వినియోగదారు ఇది మహారాష్ట్రలోని పన్వేల్‌కు చెందినదని చెబుతున్నారు. అయితే దీనిని ధృవీకరించడంలేదు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లంతా వారిని ప్రశంసించడంతోపాటు వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో పర్వతం నుంచి పడిపోయిన ఆవును లాగడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో వారు ఒకరికొకరు శక్తిని ప్రసాదించాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇక్కడ చిన్నపాటి పొరపాటు జరిగినా ఆవుతో పాటు ఒకరిద్దరి ప్రాణాలు కోల్పోవడం ఖాయమనిపిస్తోంది.
ఇక్కడ వీడియో చూడండి
ఈ వీడియో Redditలో r/HumansBeingBros అనే ఖాతా షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి పలురకాల కామెంట్లు చేస్తున్నారు. నిజంగా అలాంటి వారిని చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉందని అర్థం అవుతుందంటూ యూజర్లు కొనియాడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి