Wedding Video : అరెరరె.. ఇదేక్కడి పరేషాన్‌రా బాబు.. వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు..

ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వరుడు చేసిన పొరపాటు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వరుడు ఇలా చేస్తాడని బహుశా కలలో కూడా ఎవరూ ఊహించలేరు.

Wedding Video : అరెరరె.. ఇదేక్కడి పరేషాన్‌రా బాబు.. వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు..
Wedding Loan

Updated on: Aug 07, 2022 | 12:50 PM

Bride groom video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వరుడు చేసిన పొరపాటు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వరుడు ఇలా చేస్తాడని బహుశా కలలో కూడా ఎవరూ ఊహించలేరు. అయితే వీడియో చూసిన తర్వాత నవ్వు ఆపుకోవడం కష్టం. మీరు వీడియోని ఎన్నిసార్లు చూసినా మీ మనసు నిండదు. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ అయిన కొన్ని క్షణాల్లో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో కొన్ని సెకన్లలో పెళ్లి ఊరేగింపు బాంక్వెట్ హాల్‌కు చేరుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. వరుడు వేదికపై ఉన్నాడు. వధువు కూడా సమీపంలో నిలబడి ఉంది. ఇద్దరూ జయమాల కార్యక్రమం కోసం నిలబడి ఉన్నారు. అయితే, వరమాల వేడుకలో ఏం జరిగిందో ఊహించలేం..

ఇవి కూడా చదవండి

ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇందులో వధువు వరుడికి జయమాల వేసింది. ఇప్పుడు వరుడు కూడా జయమాలను వధువు మెడలో వేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఏం జరిగిందంటే..నిజానికి, వరుడు వధువు మెడలో దండ వేయగానే, అది ఆమె నుదిటిపై వేలాడదీసింది. ఈ సీన్ చూసి ఎవరైనా నవ్వుకోవచ్చు. ఆశ్చర్యకరంగా, వరుడు మళ్లీ ప్రయత్నించినప్పుడు.. జయమాల ఆమె మెడలో పడకుండానే.. నుదిటికి తగిలి..నేరుగా నేల మీద పడింది. ఆ తర్వాత వీడియోలో ఏం జరిగిందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ ఫన్నీ వీడియోను ఘంటా అనే పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షణలు లభించగా, లక్ష మందికి పైగా లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి