సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రస్తుతం యువత పెళ్లిళ్లను వెరైటీగా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క వేడుక గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
వీడియోలో వివాహ వేదికపై యువతి, యువకుడు పెళ్లి జరుగుతోంది. ఎంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు.అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుక ముగిసింది. వేడుకకు హాజరైన వారితో ఫొటోలు దిగేందుకు వధువు, వరుడు.. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీదకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో.. డీజే పాటలు ప్రారంభం కావటంతో వరుడు పట్టరాని సంతోషంతో స్టెప్పులేశాడు. స్టేజ్ మొత్తం కలియ తిరుగుతూ డ్యాన్స్‌తో ఊపేశాడు..డ్యాన్స్ మధ్యలోనే తన జేబులోంచి కొంత డబ్బును తీసి, వధువుపై చల్లాడు. అతడు చేసిన పనికి వధువు ఒక్కసారిగా షాకైంది.
ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా స్పందిస్తున్నారు.