తాళికట్టు శుభవేళ.. ! పెళ్లికి నో చెప్పిన వరుడు.. కట్‌చేస్తే పెళ్లికూతురు చెల్లెలితో.. ప్రేమ..!!

|

May 10, 2023 | 10:26 AM

. కారణం ఎంటా ఆరా తీయగా తాను పెళ్లికూతురు చెల్లెలిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమెను కాదని అక్కతో పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో బంధువులు, అతిథులంతా బిత్తరపోయిన ముఖాలతో తలలు పట్టుకున్నారు. కానీ, ఎట్టకేలకు..

తాళికట్టు శుభవేళ.. ! పెళ్లికి నో చెప్పిన వరుడు.. కట్‌చేస్తే పెళ్లికూతురు చెల్లెలితో.. ప్రేమ..!!
Marriage
Image Credit source: TV9 Telugu
Follow us on

వివాహ వేదికపై ఊహించని క్లైమాక్స్ అంటే ఇదేమరీ..! పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అమ్మాయి, అబ్బాయి తరపు కుటుంబీకులు. చుట్టాలు, బంధువులు మండపానికి వచ్చేశారు. పురోహితుడు కూడా కల్యాణ వేదికపై కూర్చుని ఉన్నాడు. ఓ వైపు పెళ్లికి వచ్చిన అతిథులకు కావాల్సిన అన్ని మర్యాదలు, భోజనాలు సిద్ధం చేశారు. భజా భజాంత్రీలు మోగుతున్నాయి. పీటలపై పెళ్లి కూతురితో ముందు జరగాల్సిన పూజాది కార్యక్రమాలు చేయిస్తున్నాడు పంతులు.. అంతలోనే ఎదురైన ఊహించిన సంఘటన పెళ్లి కూతురుతో పాటుగా పెళ్లికి విచ్చేసిన బంధువులను సైతం షాక్‌ అయ్యేలా చేసింది. పెళ్లి పీటల పైకి రావాల్సిన పెళ్లి కొడుకు.. అనూహ్యంగా వెనుదిరిగాడు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ మాట మార్చాడు.. కారణం ఎంటా ఆరా తీయగా తాను పెళ్లికూతురు చెల్లెలిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమెను కాదని అక్కతో పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో బంధువులు, అతిథులంతా బిత్తరపోయిన ముఖాలతో తలలు పట్టుకున్నారు. కానీ, ఎట్టకేలకు అందరి అంగీకారం, ఆశీస్సులతో అదే వేదికపై ప్రియురాలికి తాళి కట్టాడు. ఈ ఘటన బీహార్‌లోని సరన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్తల వైరల్‌గా మారింది.

వరుడు ఛప్రా ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్. రింకూ అనే యువతితో అతడి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సిన పని ముగిలి ఉండగా, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ చెప్పాడు. వధువు చెల్లెలు పుతుల్‌ను తాను ప్రేమిస్తు్న్నట్టుగా చెప్పాడు. దాంతో ఇరు కుటుంబాల మధ్య కాసేపు మాటల యుద్ధమే జరిగింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పోలీసులు కల్పించుకుని వధువరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం అందరినీ ఒప్పించి రింకూతో పెళ్లిని క్యాసిల్‌ చేయించారు. వధువు సోదరి పుతుల్‌తో వివాహం జరిపించారు.

తన సోదరి రింకూతో వివాహం నిశ్చయించకముందే తనకు పుతుల్ తెలుసునని రాజేష్ కుటుంబీకులకు చెప్పాడు. పరీక్ష రాయడానికి పుతుల్ ఛప్రా వచ్చినప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంతలో రాజేష్‌కి అతని సోదరి నుండి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ప్రేమకథ విన్న కుటుంబ సభ్యులు ఇద్దరి పెళ్లికి అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..