Viral Video: పెళ్లి వేదికపై నవ వరుడి చెత్త ప్రవర్తన.. పెళ్లి కూతురు ప్రేమగా స్వీట్ ఇస్తుంటే ఏం చూశాడో చూడండి.

|

Oct 03, 2021 | 11:42 AM

Viral Video: ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి తనకు తెలియకుండానే పుడతాడు.. ఇష్టం లేకుండానే మరణిస్తాడు. కాస్తో కూస్తో..

Viral Video: పెళ్లి వేదికపై నవ వరుడి చెత్త ప్రవర్తన.. పెళ్లి కూతురు ప్రేమగా స్వీట్ ఇస్తుంటే ఏం చూశాడో చూడండి.
Follow us on

Viral Video: ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి తనకు తెలియకుండానే పుడతాడు.. ఇష్టం లేకుండానే మరణిస్తాడు. కాస్తో కూస్తో తెలిసి చేసుకునేది వివాహం ఒక్కటే. అందుకే జీవితంలో ఇలా ఎంతో ముఖ్యమైన పెళ్లి విషయంలో యువతీ యువకులు ఆచి చూతి నిర్ణయం తీసుకుంటారు. తమకు ఇష్టమైన వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కొన్ని పెళ్లిలు చూస్తుంటే అసలు జంటలు ఇష్టంతోనే ఒక్కటవుతున్నారా? అనే సందేహాలు వస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో ఇదే ప్రశ్న తలెత్తేలా చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ కొత్త జంట వివాహ వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా నవ వధువు వరుడికి హారతీతో దిష్టి తీసిన తర్వాత అతనికి స్వీట్ తినిపించాలని ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో పెళ్లి కొడుకు ప్రవర్తించిన తీరు వధువుతో పాటు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అమ్మాయి స్వీట్‌ తినిపిస్తుంటే.. అబ్బాయి మాత్రం వద్దు అన్నట్లు తల ఊపుతూ పక్కకు జరిగాడు.

దీంతో స్వీట్ తినిపించడానికి ప్రయత్నించిన ఆ పెళ్లి కూతురు మొహాన్ని ధీనంగా పెట్టింది. దీనంతటినీ వివాహానికి హాజరైన కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు అబ్బాయి తీరును తప్పుబడుతున్నారు.

Also Read: EPF vs EPS: ప్రతి ఉద్యోగిలోనూ ఇదే ప్రశ్న.. ఈపీఎఫ్ఓలో జమకాని మీ పీఎఫ్ డబ్బు ఎటుపోతోందో తెలుసా..

Samantha-NagaChaitanya: ముగిసిన అందమైన ప్రేమకథ.. సమంత-నాగచైతన్య విడాకులపై సురేఖావాణి రియాక్షన్..

Mumbai Drug Bust: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కొడుకు