Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్

|

Jul 25, 2021 | 5:02 PM

అడవిలో జంతువులు ఫోకస్ అంతా వేటపైనే ఉంటుంది. కుందేళ్లు, జింకలు, జరాఫీలు, ఏనుగులు వంటివి పండ్లను, ఆకులను, గడ్డిని తిని ఆకలిని తీర్చుకుంటాయి...

Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్
Python Vs Cheeath
Follow us on

అడవిలో జంతువులు ఫోకస్ అంతా వేటపైనే ఉంటుంది. కుందేళ్లు, జింకలు, జరాఫీలు, ఏనుగులు వంటివి పండ్లను, ఆకులను, గడ్డిని తిని ఆకలిని తీర్చుకుంటాయి. కానీ సింహాలు, పులులు, చిరుతలు వంటివి మాంసం లేనిదే బ్రతకలేవు.  ఇక పైథాన్ అయితే పెద్ద, పెద్ద జంతువులను సైతం అలవోకగా మింగేస్తుంది. అడవిలో జంతువుల వేటకు సంబంధించిన ఘటనలు అరుదుగా మాత్రమే కెమెరా కంటికి చిక్కుతాయి. అడవి మృగాల మధ్య నిత్యం జీవన పోరాటం జరుగుతూనే ఉంటుంది. బలం ఉన్న జీవే అక్కడ మరో రోజు చూడగలుగుతుంది.  కాగా తీరిగ్గా ఉన్న చిరుత పులిని చుట్టేసి మింగి ఆకలి తీర్చుకోవాలనకుంది ఓ అతి పెద్ద కొండ చిలువ. ఏకంగా ఎదురుగా వెళ్లి నోటబట్టే ప్రయత్నం చేసింది. అయితే, చిరుత పవర్ పంజా మాములుగా ఉంటుందా. రిటర్న్ అటాక్‌తో చిరుత.. కొండ చిలువకు చుక్కలు చూపించింది. తన పదునైన పళ్లలో గాయాలు చేసింది. దీంతో కొండ చిలువ ఏం చెయ్యలేక గమ్మనుండిపోయింది.  ఈ సంఘటన కెన్యాలో చోటు చేసుకుంది. డైలీ మెయిల్ కధనం ప్రకారం కెన్యాలోని మాసాయి మారా ట్రైయాంగిల్ రిజర్వ్ లో జరిగిన సంఘటన వీడియో లో చిక్కింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా చిరుత, కొండ చిలువల భీకర పోరాటంపై ఓ లుక్కెయ్యండి.

Also Read: ఏలియన్స్‌ రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఆసక్తికర విషయాలు

సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్