
సాధారణంగా గొరిల్లాలు మనిషుల్లా కొన్ని చిలిపి పనులు చేస్తాయని సినిమాల్లో చూస్తూ ఉంటాం. మరికొన్ని గొరిల్లాలైతే మనుషులతో ఆటలాడినట్లు కూడా సినిమాల్లో చూస్తాం. నిజంగా వాటి ప్రవర్తన కూడా అలానే ఉంటుందా అంటే ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. ఓ జూలో ఓ భారీ ఆకారంలో ఉన్న గొరిల్లా తన రెండు కాళ్లతోనే వేగంగా నడుస్తూ వెళ్తోంది. మనిషి ఏదో ఆలోచిస్తూ వేగంగా ఏలా నడుస్తాడో అచ్చు అలానే నడుస్తూ ఓ వ్యక్తి కెమెరాకు చిక్కింది. అంతే ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఆ గొరిల్లా వీడియో ఆదివారం రోజు పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లో లక్షల్లో దానిని వీక్షించారు. వేలల్లో షేర్ లు చేస్తూ.. గొరిల్లా నడకను చూస్తూ మురిసిపోతూ కామెంట్లు పెట్టారు.
when someone is holding the door open for you but you a little far away pic.twitter.com/gIcC4QEHLm
— zander (@alezander) March 17, 2019