Viral Video: ఏంది మావ ఈ టాలెంట్.. 15 సెకన్లలో గప్ చుప్ సాంబార్ బుడ్డి

ఎవరు చేసే పనిలో వారికి నైపుణ్యం చాలా అవసరం. లేకపోతే ముందుకు వెళ్లలేరు. అది దొంగతనమైనా..మరోటైనా.. ఏదైనా ట్యాలెంట్‌ ఉండాల్సిందే. ఆ విషయంలో ఓ దొంగను మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే కేవలం సెకన్ల వ్యవధిలో ఎంతో చాకచక్యంగా బైక్‌ కొట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Viral Video: ఏంది మావ ఈ టాలెంట్.. 15 సెకన్లలో గప్ చుప్ సాంబార్ బుడ్డి
Thief

Updated on: Apr 08, 2025 | 11:57 AM

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ షాపు ముందు వరుసగా బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. వాటన్నిటినీ దూరం నుంచి పరిశీలించిన ఓ వ్యక్తి నెమ్మదిగా అక్కడకు వచ్చాడు. అక్కడ ఉన్న ఓ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పైన అతని దృష్టి పడింది. అంతే అదేదో తన సొంత బైక్‌ అన్నట్టుగా వాహనం వద్దకు వచ్చి నిలబడి అటూ ఇటూ చూశాడు. ఎవరూ తనను గమనించడం లేదని ఫిక్స్‌ అయ్యాక ఓ చిన్న పరికరంతో క్షణాల్లో బైక్‌ తాళం తెరిచాడు. అనంతరం సీటుపై కూర్చుని బైక్‌ను స్టార్ట్ చేసి రెప్పపాటులో అక్కడి నుంచి మాయమయ్యాడు.

బయటకు వచ్చి చూసుకున్న బైక్ యజమాని తన వాహనం కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్‌కు అంత బలహీన లాకింగ్ సిస్టమా? అని విమర్శిస్తున్నారు. నోయిడాలో తన బుల్లెట్ కూడా ఇలాగే చోరీకి గురైందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా, తాజాగా చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఇంచుమించు రూ. 2,25,000. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 7న జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..