అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..

సాధారణంగా పింక్ కలర్ అనే ప్రస్తావన వచ్చిందంటే చాలా అది అమ్మాయిల రంగు అని వెంటనే చెప్పేస్తారు. ఇంతకు పింక్‌ కలర్‌ను అమ్మాయిల రంగు అని ఎందుకుం అంటారు. అసలు అమ్మాయిలూ ఈ పింక్‌ కలనే ఎందుకు ఇష్టపడుతారో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? అసలు విషయం ఇదేనట..
Why Girls Prefer Pink

Updated on: Jan 02, 2026 | 9:17 PM

సాధారణంగా అమ్మాయిలు గులాబీ రంగును ఎక్కువగా ఇష్టపడతారు. ధరించే దుస్తుల నుండి వారు ఉపయోగించే వస్తువుల వరకు, చిన్న పిల్లల నుంచి యువతులు వరకు ప్రతి ఒక్కరూ గులాబీ రంగును ఎంచుకుంటారు. అందుకే గులాబీ రంగును అమ్మాయిల రంగు అని పిలుస్తారు. అదేవిధంగా అబ్బాలు ఎక్కువగా బ్లూ కలర్ ఇష్టపడుతారు కాబట్టి నీలం రంగును అబ్బాయిల రంగు అని పిలుస్తారు. ఇంతకు అమ్మాయిలూ పింక్, అబ్బాయిలు బ్లూ కలర్‌ను ఎందుకు ఇష్టపడతారు? దీని గురించి మీరెప్పుడైనా అలోచించారా?

దీని వెనక ఎంతో చరిత్ర ఉంది. ఈ రంగులను లింగంతో అనుసంధానించే విషయంలో సంస్కృతి, చరిత్ర అనేవి సైన్స్ కంటే పెద్ద పాత్ర పోషిస్తాయి. 19వ శతాబ్దం ఎండింగ్, 20వ శతాబ్దం స్టార్టింగ్‌ నాటికి, ఇప్పటికి ప్రపంచం ఆలోచించే విధానం పూర్తిగా భిన్నంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో, అబ్బాయిలు, అమ్మాయిలకు అంటే ప్రత్యేక రంగులు ఉండేవి కాదు.. ఇద్దరూ తెలుపు లేదా లేత రంగు దుస్తులను ధరించేవారు. ఎందుకంటే వాటిని శుభ్రంగా ఉంచడం సులభం అని వారు భావించేవారు.

ఆ కాలంలోని ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గులాబీ రంగు, ఎరుపు రంగుకు మృదువైన రూపం. ఎరుపు రంగును అభిరుచి, బలం, ధైర్యానికి చిహ్నంగా భావించేవారు. దీనికి విరుద్ధంగా, నీలం రంగును శాంతి, సున్నితత్వం, స్వచ్ఛతకు చిహ్నంగా భావించేవారు.1940ల తర్వాత, ప్రకటనలు, మ్యాగజైన్‌లు, హాలీవుడ్ సినిమాలు ఈ భావనను మరింత బలోపేతం చేశాయి. క్రిస్టియన్ డియోర్ వంటి ప్రముఖ డిజైనర్లు మహిళలు గులాబీ రంగు ధరించాలని సిఫార్సు చేయడం స్టార్ట్ చేశారు. కాలక్రమేణా, గులాబీ క్రమంగా అమ్మాయిల చిహ్నంగా మారింది.

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్‌, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు!

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,