Viral Video: అందంగా ఉన్నామని నా అడ్డలోకే వస్తారా..? అమ్మాయిలకు గజరాజు దమ్కీ..

|

May 11, 2023 | 9:33 AM

ఈ వైరల్‌ వీడియోని ఐఎఫ్‌ఎస్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, వీడియోకి అతను క్యాప్షన్‌ ఇలా రాశారు – మీరు జంగిల్ సఫారీలో మనుషుల్లా ప్రశాంతంగా, మర్యాదగా ఉండండి. సఫారీ సమయంలో అడవి మధ్యలో సింహాలు, చిరుతలు, మరేదైనా జంతువులను చూసి ఇలాంటి వింత వింత శబ్ధాలు చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Viral Video: అందంగా ఉన్నామని నా అడ్డలోకే వస్తారా..? అమ్మాయిలకు గజరాజు దమ్కీ..
Elephant Jungle Safari Vide
Follow us on

జంగిల్ సఫారీ సమయంలో పెద్ద శబ్ధాలు చేయరాదని ముందుగానే సిబ్బంది హెచ్చరిస్తుంటారు. అలా చేయటం వల్ల అడవిలోని జంతువులు బెదిరిపోయి మనపై దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందే హెచ్చరిస్తారు. కానీ, మనవాళ్లు ఊరికే ఉంటారా..? లేదంటే, చెప్పిన మాట వింటారా..? కానీ, జూలో అరుపులు, కేకలు వేయటం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏనుగును చూడగానే పట్టరాని సంతోషంతో కొందరు ఆడపిల్లలు కేకలు వేయడం ప్రారంభించారు. ఆ తర్వాత సీన్‌ ఎవరూ ఊహించని రీతిలో జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

జంగిల్ సఫారీకి వెళ్లిన అమ్మాయిల గ్యాంగ్ ఏనుగును చూస్తుందని ఊహించలేదు. దగ్గర వచ్చిన గజరాజుని చూడగానే సంతోషం పట్టలేకపోయారు. ఏనుగు ఎదురుగా కనబడగానే అమ్మాయిలు గట్టిగా నవ్వటం, కేకలు వేయటం మొదలుపెట్టారు. అందులో ఓ యువతి జీపులో కూర్చొని వీడియోలు తీస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డుకు అడ్డంగా వచ్చిన భారీ గజరాజు.. వారి వాహనం వైపు పరిగెత్తుకుంటూ రావడం గమనిస్తుంది. వెంటనే తన స్నేహితులను అప్రమత్తం చేస్తూ అరిచింది. వాహనం నడుపుతున్న వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి జీపును రివర్స్‌లో అంతేవేగంగా వెనక్కి పరుగులు తీయించారు. దాంతో ఏనుగు దాడి నుంచి వారు తప్పించుకోగలిగారు. జీపు రివర్స్‌లో వెళ్తుంటే.. ఏనుగు కొంత దూరం వారిని వెంబడించి వదిలిపెట్టింది. ఇది నా అడ్డా.. మీరు ఇక్కడికి వచ్చింది గాక, నా ముందే రెచ్చిపోతారా..? అన్నట్టుగా ఆ అడవి ఏనుగు వారికి దమ్కీ ఇచ్చి వదిలిపెట్టింది. వారిని అంతదూరం తరిమిన తర్వాత ఆ ఏనుగు మళ్లీ ఇటువైపు వస్తారా..? అన్నట్టుగా అకడ్నుంచి తన దారిన తాను వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్‌ వీడియోని ఐఎఫ్‌ఎస్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, వీడియోకి అతను క్యాప్షన్‌ ఇలా రాశారు – మీరు జంగిల్ సఫారీలో మనుషుల్లా ప్రశాంతంగా, మర్యాదగా ఉండండి. సఫారీ సమయంలో అడవి మధ్యలో సింహాలు, చిరుతలు, మరేదైనా జంతువులను చూసి ఇలాంటి వింత వింత శబ్ధాలు చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి అనేక వీడియోలు గతంలో చాలానే తెరపైకి వచ్చాయి. కేవలం 13 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన వినియోగదారులు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..