Girl Travelling in metro with Cycle: మెట్రోలో ఆగని అరాచకాలు.. ఈ సారి ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! ఇలా కూడా వెళ్లొచ్చా..?

|

Feb 26, 2024 | 5:12 PM

సాధారణంగా ఇలాంటి దృశ్యం మెట్రోల్లో ఎప్పుడూ కనిపించదు. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఢిల్లీ మెట్రోలోనే ఎక్కువగా ఇలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇక వీడియోపై చాలా మంది స్పందించారు..ప్పుడు నేను కూడా నా గేదెతో వెళ్తాను, నన్ను ఎవరు ఆపుతారో చూద్దాం అని ఒకరు రాశారు. CISF కూడా అజాగ్రత్తగా మారిందని మరో సోషల్ మీడియా యూజర్ రాశారు. ఇది మరీ టూ మచ్ అని ఒకరు రాశారు? మెట్రో రైల్‌కు బదులు ఇండియన్ రైల్వేస్ అని ఒకరు రాశారు.

Girl Travelling in metro with Cycle: మెట్రోలో ఆగని అరాచకాలు.. ఈ సారి ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! ఇలా కూడా వెళ్లొచ్చా..?
Girl Travelling in metro with Cycle
Follow us on

ఇటీవల మెట్రోకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెట్రోలో ప్రయాణికుల మధ్య గొడవలు, ఘర్షణలు, పాటలు పాడటం, డ్యాన్స్‌లు చేయటం, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన అనేక చిత్ర విచిత్ర వీడియోలను మనం చూస్తుంటాం.. కొన్ని వీడియోలు చూస్తే.. అందరికీ కోపం వస్తే మరికొన్న వీడియోలు నవ్వుతెపించేలా ఉంటాయి. ప్రస్తుతం, మెట్రోలో ఓ అమ్మాయి సైకిల్‌తో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి సైకిల్‌తో మెట్రోలో ప్రయాణిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.. మెట్రోలో సైకిల్‌తో ప్రయాణించగలరా..? అని ఆలోచిస్తున్నారు. ఈ వీడియోపై చాలా మంది నుంచి స్పందన వస్తోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది దీనిపై కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో, మెట్రోలో ఒక అమ్మాయి సైకిల్‌తో నిలబడి ఉంది. సాధారణంగా ఇలాంటి దృశ్యం మెట్రోల్లో ఎప్పుడూ కనిపించదు. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఢిల్లీ మెట్రోలో సైకిల్‌తో ప్రయాణీకులెవరూ ప్రయాణించరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు చెందినదని సోషల్ మీడియాలో కొందరు వినియోగదారులు చెబుతుండగా, ఈ వీడియో నాగ్‌పూర్ మెట్రోకు చెందినదని కొందరు పేర్కొన్నారు. వీడియో చూసిన తర్వాత, అక్క సైకిల్‌ను పార్క్ చేస్తుండగా, మధ్యలో మెట్రో వచ్చిందని మరికొందరు సోషల్ మీడియా వినియోగదారు వ్యాఖ్యానించారు.

పాట్నాలో ప్రారంభమయ్యే మెట్రోలో బకెట్లలో పాలు తీసుకుని రైలు ఎక్కి తర్వాతి స్టేషన్‌లో దిగుతారని ఒకరు రాశారు. ఇది సాధ్యమేనని ఒకరు రాశారు. ఇది ముంబై మెట్రో అని, సైకిల్‌తో ఇక్కడికి వెళ్లవచ్చని ఒకరు రాశారు. ఇప్పుడు నేను కూడా నా గేదెతో వెళ్తాను, నన్ను ఎవరు ఆపుతారో చూద్దాం అని ఒకరు రాశారు. CISF కూడా అజాగ్రత్తగా మారిందని మరో సోషల్ మీడియా యూజర్ రాశారు. ఇది మరీ టూ మచ్ అని ఒకరు రాశారు? మెట్రో రైల్‌కు బదులు ఇండియన్ రైల్వేస్ అని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..