అబ్బాయిని ఆటపట్టించేందుకు యువతి యత్నం.. భద్రాకాళిలా మారిన అతని ప్రియురాలు.. మీరే చూడండి!

|

Apr 06, 2025 | 5:25 PM

ప్రస్తుత రోజుల్లో ఒక షాపింగ్ మాల్‌లో చోటుచేసుకున్న ఫన్నీ వీడియో చర్చనీయాంశంగా మారింది. షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్ దిగుతున్న ఒక అబ్బాయిని ఆటపట్టించాలనుకుంది ఓ అమ్మాయి. అయితే పక్కనే ఉన్న అతని స్నేహితురాలు ఆమె జుట్టుకుని లాగి కొట్టింది. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రీల్ చేయబోయి చావు దెబ్బలు తిన్నదీ ఆ యువతి.

అబ్బాయిని ఆటపట్టించేందుకు యువతి యత్నం.. భద్రాకాళిలా మారిన అతని ప్రియురాలు.. మీరే చూడండి!
Shocking Girl Video
Follow us on

ప్రస్తుత కాలంలో జనం రీల్స్ మోజులో ఏం చేయడానికి ఏదైనా సిద్ధపడుతున్నారు. కొన్నిసార్లు దీని కారణంగా వారు ఇబ్బందుల్లో పడతుంటారు. అలాంటి వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ అవుతుంటాయి. ఆది చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక అమ్మాయి తన చర్యల వల్ల మాల్‌లోని జనం తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి మరిన్ని రీల్స్ తయారు చేయమని అంటున్నారు!

వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక షాపింగ్ మాల్‌కి సంబంధించినది. అక్కడ ఒక మహిళ ఒక అబ్బాయిని ఆటపట్టించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన తప్పు ఏమిటంటే ఆమె అలా చేసే సమయంలో ఆ అబ్బాయి స్నేహితురాలు అతనితో పాటు ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని డిస్టర్బ్ చేయగానే, అతని పక్కనే ఉన్న అతని స్నేహితురాలికి చిర్రెత్తుకొచ్చింది. ఆమె చివరకు ఈ అమ్మాయి జీవితంలో మళ్ళీ ఎప్పటికీ రీల్ చేయకూడదనుకునేలా షాక్ ఇచ్చింది.

వీడియోను ఇక్కడ చూడండి..

వీడియోలో ఒక జంట ఎస్కలేటర్ నుండి కిందకు వస్తున్నారు. ఇంతలో, అక్కడ ఒక అమ్మాయి రీల్ చేసే మోజులో అబ్బాయిని ఆటపట్టించాలనుకుంది. ఈలోగా, ఆ అమ్మాయి ఉద్దేశాలను పసిగట్టిన పక్కనే ఉన్న అతని స్నేహితురాలు, ఆమెపైకి దూసుకెళ్లి ఆమె జుట్టు పట్టుకుని లాగేసింది. ఆమెను మెట్ల మీద నుంచి కిందకు లాగి కొట్టింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మొత్తం దృశ్యాన్ని షాపింగ్ మాల్ ఉన్నవారంతా చూసి షాక్ అయ్యారు.

ఈ వీడియోను @YonnyBravo_ అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయడం జరిగింది. ఈ వార్త రాసే సమయానికి, 19 లక్షలకు పైగా జనం దీనిని చూశారు. ఈ రీల్ పై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్, ‘మాల్ మధ్యలో అలాంటి పని ఎవరు చేస్తారు బ్రదర్?’ అని రాశాడు. మరొకరు ఎవరైనా ఎటువంటి కారణం లేకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకున్నప్పుడు వచ్చే ఫలితం ఇదేనని రాశారు. ఇది కాకుండా, అనేక ఇతర వినియోగదారులు దానిపై చిత్రవిచిత్రంగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..