Viral Video: బయట ఆడుకుని ఇంట్లోకి వస్తున్న చిన్నారి.. గుమ్మం వద్దే నక్కిన నాగుపాము.. క్షణాల్లో

|

May 31, 2023 | 4:49 PM

లక్కీ గర్ల్.. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకుంది చిన్నారి. గుమ్మంలో ఉన్న ఆ పామును తొలుత గమనించలేదు చిన్నారి. తను అక్కడికి రాగానే ఆ పాము తల పైకి లేపి కాటు వేసేందుకు యత్నించింది. ఆ తర్వాత...

Viral Video: బయట ఆడుకుని ఇంట్లోకి వస్తున్న చిన్నారి.. గుమ్మం వద్దే నక్కిన నాగుపాము.. క్షణాల్లో
Snake Viral Video
Follow us on

ఈ పాప చాలా అంటే చాలా లక్కీ. ప్రమాదకర తాచుపాము కాటు నుంచి క్షణాల వ్యవధిలో తప్పించుకుంది. వీడియో చూస్తే మీకు కూడా గుండెల్లో దడ పడుతుంది. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలోని హలగా గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. చిన్నారి బయట ఆడుకుని ఇంట్లోకి వస్తుంది. ఇంటి గుమ్మం వద్ద ఓ తాచుపాము బుసలు కొడుతూ అక్కడే కాచుకుని ఉంది. పాప ఆ ప్రమాదకర సర్పాన్ని గమనించకుండా అలాగే ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో పాము తల పైకెత్తి అమ్మాయిని కరిచేందుకు యత్నించింది. దీంతో పామును చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాలిక.. అక్కడి నుంచి పరుగులు తీసింది. దీంతో పెను ప్రమాదం నుంచి బయడపింది. ఈ ఘటన తాలూకా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రజంట్ పీక్ సమ్మర్ నడుస్తుంది కదా..? వేడిని తట్టుకోలేక పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. అవి ఎక్కువగా నీటి మడుగులు, చెట్ల పొదల వంటి ప్రాంతాల్లో సేదతీరుతూ ఉంటాయి. ఆదమరిచి అటుగా అడుగులు వేస్తే కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పొలాలు, అటవీ ప్రాంతాలకు సమీప ప్రాంతాల్లో నివశించేవారు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ పాములు, ఇతర వన్యప్రాణులు తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..