Viral Video: కార్లను మింగిన భూమి.. పార్కింగ్ స్థలంలో ఉంచిన కార్లు.. సొరంగంలోకి.. షాకింగ్ వీడియో..

Jerusalem hospital: రహదారిపై వాహనాలన్నీ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసుపత్రి దగ్గర నిలిపి ఉంచిన మూడు కార్లు అకస్మాత్తుగా భూమిలోకి దూసుకెళ్లాయి.

Viral Video: కార్లను మింగిన భూమి.. పార్కింగ్ స్థలంలో ఉంచిన కార్లు.. సొరంగంలోకి.. షాకింగ్ వీడియో..
Giant Sinkhole Swallows Three Cars

Updated on: Jun 09, 2021 | 2:21 PM

Jerusalem hospital: రహదారిపై వాహనాలన్నీ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసుపత్రి దగ్గర నిలిపి ఉంచిన మూడు కార్లు అకస్మాత్తుగా భూమిలోకి దూసుకెళ్లాయి. సొరంగం ఒక్కసారిగా ఈ కార్లను కబళించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెం జాతీయ రహదారికి సమీపంలోని పార్కింగ్ స్ధలంలో జరిగిన ఈ సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. షారే జెడెక్ మెడికల్ సెంటర్ పార్కింగ్ స్థలంలో సోమవారం భూమి హఠాత్తుగా కుంగిపోయి.. అక్కడ ఉంచిన మూడు కార్లు గుంతలో పడిపోయాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.

అయితే.. ఈ ప్రాంతంలో ఒక సొరంగం నిర్మాణంలో ఉందని అధికారులు తెలిపారు. ఇది ఆసుపత్రి పార్కింగ్ స్థలం కింద వెళుతోందని.. ఈ క్రమంలో సొరంగం పాక్షికంగా కూలిపోయిందని వెల్లడించారు. దీంతో సొరంగం పైన ఉన్న కార్లు ఒక్కసారిగా భూమిలోకి పడిపోయాయని వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా భయపడిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వీడియో..

Also read:

యాంటీ బాడీల వృద్ధికి మాస్ వ్యాక్సినేషన్ పరిష్కారం…..లక్నో మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి

Mehul Choksi: మెహుల్‌ చోక్సీకి నో బెయిల్‌.. విచారణను వాయిదా వేసిన డొమినికా కోర్టు..