Viral: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ రాతి వస్తువు.. దాని చుట్టూ ఉన్న మట్టిని తీయగా..

|

Sep 05, 2022 | 12:15 PM

పైన పేర్కొన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోవద్దు.! ఏంటి చెట్టు కొమ్మలా ఉంది అని అనుకోవద్దు.! అది కొమ్మ కాదండోయ్..

Viral: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ రాతి వస్తువు.. దాని చుట్టూ ఉన్న మట్టిని తీయగా..
Viral Photo
Follow us on

పైన పేర్కొన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోవద్దు.! ఏంటి చెట్టు కొమ్మలా ఉంది అని అనుకోవద్దు.! అది కొమ్మ కాదండోయ్.. ఏనుగు దంతం.. ఇప్పటిది కాదు.. ఏకంగా 5 లక్షల ఏళ్ల కిందటిది. ఇజ్రాయిల్‌కు చెందిన పురావస్తు అధికారులు ఓ ఎవాక్యువేషన్ స్థానం‌లో తవ్వకాలు జరుపుతుండగా ఈ అరుదైన ఏనుగు దంతం బయటపడింది. ఎనిమిదిన్నర అడుగుల పొడవు, 150 కిలోల బరువున్న ఈ అరుదైన అద్భుతాన్ని ఈటన్ మోర్ అనే పురావస్తు శాఖ అధికారి.. దక్షిణ ఇజ్రాయిల్‌లోని ఓ గ్రామంలో ఉన్న ఆ స్థలంలో కనుగొన్నారు.

సుమారు 4 లక్షల ఏళ్ల కిందట అంతరించిపోయిన ఏనుగు దంతం ఇది అని.. దాని పక్కనే ఆది మానవులు ఉపయోగించే ఓ రాతి వస్తువు కూడా లభ్యమైనది అని పురావస్తు అధికారులు పేర్కొన్నారు. తవ్వకాల్లో దొరికిన దంతం సైజ్‌ను చూస్తుంటే.. ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న ఏనుగుల కంటే ఆ ఏనుగులు చాలా పెద్దవని చరిత్రకారులు చెబుతున్నారు. అంతటి జంతువును వేటాడాలంటే.. ఒకరితో అయ్యే పని కాదని.. సమూహంగా చేసే ఉండొచ్చునని చెప్పుకొచ్చారు. అలాగే ఆ ఏనుగు దంతంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు పరిశోధకులు.