Frankfurt Airport: నదిలా మారిన ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం.. విమాన రాకపోకలు బంద్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

జర్మనీలోని అంతర్జాతీయ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం వరదల్లో చిక్కుకుపోవడంతో సేవలను నిలిపివేశారు. విమానాశ్రయంలోపలకు, వెలుపలకు వెళ్లే విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షం కొనసాగుతూ ఉండడంతో రన్‌వేలు ఈత కొలనులుగా మారాయి. దీంతో పలు విమానాల దారి మళ్లించారు. మరికొన్నింటిని  రద్దు చేశారు. తుఫాను, వరదల కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

Frankfurt Airport: నదిలా మారిన ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం.. విమాన రాకపోకలు బంద్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు
Frankfurt Airport

Updated on: Aug 18, 2023 | 11:54 AM

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరాన్ని ఉరుములతో కూడిన భారీ వర్షం ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నీతితో నిండిన విధులతో పాటు ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం పూర్తిగా జలమయమైంది. జర్మనీలోని అంతర్జాతీయ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం వరదల్లో చిక్కుకుపోవడంతో సేవలను నిలిపివేశారు. విమానాశ్రయంలోపలకు, వెలుపలకు వెళ్లే విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షం కొనసాగుతూ ఉండడంతో రన్‌వేలు ఈత కొలనులుగా మారాయి. దీంతో పలు విమానాల దారి మళ్లించారు. మరికొన్నింటిని  రద్దు చేశారు. తుఫాను, వరదల కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

జర్మన్ పబ్లికేషన్ ది లోకల్‌లోని ఒక నివేదిక ప్రకారం వాయువ్య జర్మన్ లో మినహా దేశవ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ సేవ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని.. తక్కువ సమయంలోనే చదరపు మీటరుకు 25 నుంచి 40 లీటర్ల వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

గత వారం నుంచి దక్షిణ జర్మనీలో భారీ వర్షాలు కురుస్తుండగా ర్యూట్లింగెన్ నగరంలో వడగళ్ల వాన కురిసింది.  వడగళ్ళ వర్షంతో తక్కువ సమయంలో ఒక అడుగు వరకు పేరుకున్నాయి. మరోవైపు వరద బాధితుల సహాయం కోసం అగ్నిమాపక సిబ్బంది, నగర కార్మికులు రంగంలోకి దిగారు. రోడ్లను క్లియర్ చేయడంలో సహాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..