CDS Bipin Rawat : పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్.. మయన్మార్ మిలిటరీ ఆపరేషన్.. అందుకే ఆయనంటే ప్రధానికి అంత నమ్మకం..
హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూసినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది.
హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూసినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది. తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది కన్నుమూశారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్‌కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. స్కూలింగ్ తర్వాత మరో ఆలోచన లేకుండా సైన్యంలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో పాకిస్థాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, అంతకుముందు మయన్మార్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌కు కూడా బిపిన్ రావతే ఆద్యుడు.
తండ్రి స్ఫూర్తితో..
ఉత్తరాఖండ్‌లోని పౌరీలోని ఓ రాజ్‌పుత్ కుటుంబంలో 1958లో జన్మించారు రావత్. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా సేవలందించారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన బిపిన్ కూడా పాఠశాల స్థాయిలోనే డిఫెన్స్ అకాడమీలో చేరారు. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఆతర్వాత అమెరికాలోని కాన్సాస్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో హైయ్యర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. ఆపై ఎంఫిల్, కంప్యూటర్‌లో డిప్లోమా, మిలిటరీ మీడియా అండ్ స్ర్టాటజిక్ స్టడీస్‌పై పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1978లో సెకండ్ లెఫ్టినెంట్గా గుర్జా రైఫిల్స్‌లో తన కెరీర్‌ను ఆరంభించారు బిపిన్ రావత్. అంతకు ముందు ఆయన తండ్రి కూడా ఇక్కడి నుంచే కెరీర్ ప్రారంభించడం విశేషం. ఆతర్వాత భారత సైన్యంలోని వివిధ విభాగాల్లో పలు కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. 2017 జనవరి 1న బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సర్జికల్ స్ట్రైక్స్‌తో.. 2015లో బిపిన్ రావత్ ధింపూర్‌లో టైగర్ కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో 18 మంది భారత సైనికులను యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు దారుణంగా హతమార్చి మయన్మార్ పారిపోయారు. దీంతో బిపిన్ రావత్ నాయకత్వంలోని భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్‌లోకి చొరబడింది. భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఇక 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందికి పైగా సైనికులు మరణించారు. అప్పుడు ఆర్మీ చీఫ్ హోదాలో ఉన్న బిపిన్ రావత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌నే ఆయుధంగా ఎంచుకున్నారు. పాక్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించిన మన సైనికులు అక్కడ తలదాచుకుంటోన్న జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇలా ఎన్నో ఆర్మీ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన బిపిన్‌రావత్ తన సైనికులకు ఎప్పుడూ ఓ ఐదు సూత్రాలు చెబుతూ వారిలో స్ఫూర్తి నింపేవారు. అవే.. దేశ కీర్తి ప్రతిష్టలు, నమ్మకం, లక్ష్యం, విశ్వాసం, దేశ గౌరవం. ఇక బిపిన్ రావత్ వర్క్ కమిట్‌మెంట్, ప్రొఫెషనలిజంపై ప్రధానికి బాగా విశ్వాసం. అందుకే ఆయనను భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-CDSగా నియమించారు. కాగా బిపిన్ రావత్ వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) పూర్వ విద్యార్థి కూడా. సరిగ్గా తాను చదువుకున్నచోట లెక్చరర్ ఇవ్వడానికి వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదం.
Also Read: