అందుగలదు.. ఇందు లేదు అని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే గలదు.. అదేంటో కాదండోయ్. అవును ఇప్పుడు ఎక్కడ వెతికినా గంజాయి గుప్పుమంటుంది. చెక్ పోస్ట్‌లో అనుమానాస్పందంగా కనిపించినా ఏ బండిని ఆపినా.. అందులో ఈ మాల్ కనిపిస్తుంది. పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దీని అక్రమ రవాణాకు వినియోగానికి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా జైల్లో కూడా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. చైన్నైలో ఈ ఘటన వెలుగుచూసింది. జైలు ఆవరణలో 750 ఎంఎల్ మద్యం సీసాను, 400 గ్రాముల గంజాయిని పుఝల్ జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6వ వాచ్ టవర్ దగ్గర జైలు సిబ్బంది ఈ మత్తు పదార్థాలను గుర్తించారు.
టవర్ పైన విధులు నిర్వహిస్తున్న టీఎస్‌పీ కానిస్టేబుల్‌కు ఓ పార్శిల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగా లోపల లిక్కర్ బాటిల్, గంజాయి కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పై అధికారులకు రిపోర్ట్ చేశారు. ఈ ఘటనపై పుజాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లాస్టిక్ బాటిల్‌లో మద్యం నింపి, గంజాయిని చిన్న చిన్న పొట్లాల్లో ప్యాక్ చేశారు. జైలు లోపలికి బాటిళ్లు, పార్శిళ్లు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సాధారణంగా జైల్లో సెల్ ఫోన్లు, గంజాయి ప్యాకెట్లను పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తొలిసారిగా మద్యం పట్టుబడిన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. జైలు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. (Source)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.