ganesh chaturthi : దేశవ్యాప్తంగా గణేశోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు భక్తులు. ప్రజలు తమ ఇళ్లలో వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవ రాత్రి పూజలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అద్భుతమైన గణేష్ విగ్రహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది పూర్తిగా చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. కానీ, ఈ వీడియో ఎక్కడిది అన్నది మాత్రం తెలియరాలేదు..కానీ గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు ఈ వీడియోను మాత్రం మళ్లీ మళ్లీ చూస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో సింహాసనంపై కూర్చున్న గణపతి బప్పా యొక్క పెద్ద విగ్రహాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో విగ్రహం దగ్గర నిలబడి ఒక భక్తుడు కనిపిస్తాడు. భక్తుడు గణపతి పాదాలను తాకగానే,..ఆ వినాయకుడు లేచి నిలబడి సదరు భక్తుడిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. నిజంగానే షాకింగ్‌గా ఉంది కదా న్యూస్… ముందుగా ఈ వీడియో చూద్దాం.
గణేష్ చతుర్థి సందర్భంగా.. ఆ గణనాధుడిని విగ్రహం ప్రత్యేక రూపాల్లో దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో పాటు, ‘అనువైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో వినాయక విగ్రహం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుందని ‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇంటర్నెట్ వినియోగదారులు ఎంతగానో లైక్ చేస్తున్నారు. అప్‌లోడ్ చేసిన గంటలోపే వీడియోకు 10 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. వందల మంది దీన్ని లైక్ చేశారు. వీడియో నెట్టింట దూసుకుపోతుంది. అదే సమయంలో, వీడియోను చూసిన ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తు్న్నారు.
Simple engineering technique that makes the idol so meaningful!
Happy Ganesh Chaturthi pic.twitter.com/rbvpnlTQLA— Harsh Goenka (@hvgoenka) August 31, 2022
ఈ వీడియో ఎక్కడ నుండి వచ్చింది. విగ్రహం చాలా అద్భుతంగా ఉందని ఒక వినియోగదారు కామెంట్‌లో అడిగారు. అదే సమయంలో మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ గణపతి బప్పా మోరియా అంటూ కామెంట్ చేశారు. మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ఎంత అద్భుతమైన సృజనాత్మకత అని రాశారు. మొత్తంమీద ఈ వెరైటీ వినాయక విగ్రహం మాత్రం ప్రజలను మంత్రముగ్దులను చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి