
Viral Video: ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. పెళ్లిలో జరిగే సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా సరదా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి వివాహ వేడుకల్లో.. పెళ్లి అంటే.. బంధువులు, సన్నిహితులు మధ్య ఎంతో అంగరంగ వైభవంగా ఆనందంగా చేసుకునే ఓ వేడుక. ఇలా సందడిగా జరిగే వివాహాల్లో కడుపుబ్బా నవ్వు తెప్పించే సన్నివేశాలు మనకు తారసపడుతూ ఉంటాయి. తాజాగా ఓ పెళ్ళికి సంబందించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే.. పెళ్లిలో వరుడు, వధువు ఒకరిమెడలో ఒకరు వరమాల వేసుకోవడం ఆనవాయితీ.. అయితే ఆ సమయంలో వరుడు, వరులు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే..
కానీ ఈ వీడియోలో వరుడు అమ్మాయి కంటే చాలా పొడవు ఉన్నాడు. అయితే పెళ్లికూతురు వరుడి మెడ లో మాల వేయడానికి విశ్వప్రయత్నాలు చేసింది. అతను మాత్రం బెండ్ అవ్వకుండా నిలుచొని చూస్తూ ఉండిపోయాడు. ఆ పెళ్లి కూతురు ఎగిరి మరి అతని మెడలో మల వేసింది. ఇక అతని వంతు వచ్చే సరికి సింపుల్ గా ఆమె మెడలో మాల వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెడలో మాలవేయడానికి ఆ వధువు పడిన తంటాలు ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి.