Viral Video: ఈ కుక్కపిల్ల మహా చిలిపి.. యజమానిని భయపెట్టిమరీ దాగుడుమూతలు ఆడుతున్న ఫన్నీ వీడియో వైరల్

|

Jun 18, 2022 | 1:53 PM

ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కుక్క పిల్ల.. తన యజమానితో చిలిపిగా ఆడుతూ కనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి ముఖంలోనైనా నవ్వు వస్తుంది.

Viral Video: ఈ కుక్కపిల్ల మహా చిలిపి.. యజమానిని భయపెట్టిమరీ దాగుడుమూతలు ఆడుతున్న ఫన్నీ వీడియో వైరల్
Dog Funny Video Viral
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో చాలా ఫన్నీ విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు షాక్ అనిపిస్తే.. మరొన్ని నవ్విస్తాయి.  రకరకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉన్నాయి. నెటిజన్లకు బాగా నచ్చినవి  ఇతరులకు షేర్ చేస్తూ అందిస్తారు. కొన్ని సెకన్ల వీడియోకి కూడా మిలియన్ల కొద్దీ వీక్షణలు రావడానికి కారణం ఇదే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కుక్క పిల్ల.. తన  యజమానితో చిలిపిగా ఆడుతూ కనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి ముఖంలోనైనా నవ్వు వస్తుంది.

కుక్కలు మానవులకు మంచి స్నేహితులు అనడంలో సందేహం లేదు. నిజానికి.. ఇవి చాలా తెలివైన జంతువులు.  అలాగే విశ్వాసపాత్రమైనవి. యజమాని పట్ల విధేయత, ప్రేమ, అవగాహన గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. తమ యజమాని పట్ల కుక్కలు చూపించే విశ్వాసంలో ఏ జంతువూ సాటి రాదని చెప్పవచ్చు. అంతేకాదు ఈ కుక్కలు కొంటివి కూడా.. తమ ఇంట్లో కుటుంబ సభ్యులు చేసే పనులను చూస్తూ.. అవి కూడా అలవాటు చేసుకుంటాయి. సరదాగా తమ యజమానితో ఆటలు ఆడుతున్న కుక్కల వీడియోలు చాలా నెట్టింట్లో దర్శనమిస్తూనే ఉంటాయి. ఆ వీడియో చూస్తే నవ్వొస్తుంది. ఇప్పుడు హల్ చల్ చేస్తోన్న ఈ వీడియో  చూడండి.. అందులో కుక్క తన యజమానితో దాగుడుమూతలు ఆడుతోంది. అంతేకాదు భయపెడుతూ చిలిపి ఆటలు ఆడుతుంది.

ఇవి కూడా చదవండి

రెండు అందమైన కుక్కలు మేడ మీద నుంచి కిందకు దిగిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో తమ యజమాని మెట్లు ఎక్కి.. పైకి రావడం ఆ కుక్కలు చూశాయి. అందులో ఒక చిలిపి కుక్క వెంటనే.. గోడ వెనుక దాక్కుని తమ యజమాని వచ్చే వరకు వేచి ఉంది. తమ యజమాని మెట్లు ఎక్కి.. ముందుకు రాగానే, కుక్క ఒక్కసారిగా బయటకు వచ్చి  యజమానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత కుక్క కాసేపు ఆగి దాని యజమాని ఏమి చేస్తాడో అంటూ వేచి ఉంది.  కొన్ని సెకన్ల తర్వాత ఇద్దరూ సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ దృశ్యం ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంది.

ఈ ఫన్నీ వీడియో @Yoda4ever అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటికే 2 .13 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది.  ఈ కుక్క యజమాని పట్ల నిజమైన ప్రేమ, విధేయత కలిగి ఉంది.  వీరిద్దరి దాగుడుమూతలు బాగుంటున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..