Viral Video: పక్షులకు చేతులొస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహలకు దృశ్య రూపం ఈ వీడియో..

|

Sep 12, 2021 | 2:19 PM

ఎగిరిపోతే ఎంత బాగుంటుందో.. అంటూ మనం పాటలు పాడుకుంటుంటే.. పక్షులు మాత్రం మరో పల్లవి ఎత్తుకున్నాయి. చేతులొస్తే బాగుంటుందో అంటూ సోషల్ మీడియాలో దుమ్ము రేపతున్నాయి. తాము కూడా మునుషుల్లో...

Viral Video: పక్షులకు చేతులొస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహలకు దృశ్య రూపం ఈ వీడియో..
Funny Birds
Follow us on

ఎగిరిపోతే ఎంత బాగుంటుందో.. అంటూ మనం పాటలు పాడుకుంటుంటే.. పక్షులు మాత్రం మరో పల్లవి ఎత్తుకున్నాయి. చేతులొస్తే బాగుంటుందో అంటూ సోషల్ మీడియాలో దుమ్ము రేపతున్నాయి. తాము కూడా మునుషుల్లో కీ బోర్డుపై సంగీతం పలికించొచ్చని అంటున్నాయి. మంచు దుప్పట్ల మధ్య హనిమూన్‌కు ట్రుప్పులో తెగ ఎంజాయ్‌ చేస్తామంటూ పాడుకుంటున్నాయి. మనుషులకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది అనే చాలా మంది ఊహించిన విషయమే. ఈ ఊహపై ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే పక్షులకు చేతులు వస్తే ఎలా ఉంటుంది.. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా.. పక్షులకు చేతులు వస్తే అవి ఏం చేస్తాయో ఊహించుకోండి.. ఎలా వాటిని వాడుకుంటాయి.. వాటి జీవితంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఫన్నీ వీడియో చూడాల్సిందే…

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్త సరదాగా అనిపించినా.. అందులో మనిషి జీవితం ఎలా మారిపోయిందో కూడా చూడవచ్చు. ఒక పక్షి చెట్టు కొమ్మపై కూర్చుని కొత్తగా వచ్చిన చేతులతో సెల్పీ తీసుకుంటుంది.

మరో ఫక్షి షాపింగ్ కార్ట్ పట్టుకుని నడుస్తూ బిల్లు చూసుకుంటుంది. మరో పక్షి గిటార్ వాయిస్తూ కనిపిస్తే.. ఇక మరో పక్షి జంట గోడపై కూర్చుని పుస్తకాలు చదవుతున్నాయి.

రెండు పెంగ్విన్‌లు తమ కొత్తగా వచ్చిన చేతులతో ఆఫీస్ నుంచి తిరిగి ఇంటి వస్తుంటాయి. ఆ సమయంలో ఆ రెండింటి బాడీ లాంగ్వేజ్‌ను మీరు గమనించాల్సిందే… ఇలా తనకు మనసుకు పదునుపెట్టాడు ఓ గ్రాఫిక్‌ డిజైనర్‌ ఈ వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా వేదికల్లో హల్‌ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్తే..