ఇది సార్ మనోడి రేంజ్.. తండ్రిని సంతోషపెట్టేందుకు తనయుడు ఏం చేశాడంటే..?

|

Jan 24, 2025 | 4:06 PM

1995 నుంచి 2000 వరకు ఐటీసీ హోటల్‌లో వాచ్‌మన్‌గా పనిచేసిన తండ్రిని, 25 సంవత్సరాల తర్వాత, అతని కొడుకు ఆర్యన్ మిశ్రా గెస్ట్ గా డిన్నర్‌కు తీసుకెళ్లాడు. తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను ఆర్యన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన తండ్రి గతాన్ని గుర్తుచేసుకున్నాడు. నెటిజన్లు ఈ కథను చూసి మెచ్చుకుంటూ, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇది సార్ మనోడి రేంజ్.. తండ్రిని సంతోషపెట్టేందుకు తనయుడు ఏం చేశాడంటే..?
Heartwarming Story
Follow us on

ఒక కొడుకు తన తండ్రి కోసం చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 1995 నుంచి 2000 వరకు ఐటీసీ హోటల్‌లో వాచ్‌మన్‌గా పనిచేసిన తన తండ్రిని, ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత అతని కొడుకు అదే హోటల్‌కు అతిథిగా డిన్నర్‌కు తీసుకెళ్లాడు.

ఢిల్లీకి చెందిన ఆర్యన్ మిశ్రా అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఐటీసీ హోటల్‌లో డిన్నర్ చేస్తూ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను ఏమెచర్ ఆస్ట్రోనామర్ అని చెప్పుకున్న మిశ్రా, ఆ ఫొటోతో పాటు ఈ హృదయాన్ని హత్తుకునే కథను కూడా వెల్లడించారు.

1995 నుంచి 2000 వరకు నా తండ్రి న్యూఢిల్లీ ఐటీసీలో వాచ్‌మన్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయనను అదే చోట డిన్నర్‌కు తీసుకెళ్లే అవకాశం నాకు దొరికింది అని ఆర్యన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ కథను చదివిన నెటిజన్లు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్యన్‌కు అభినందనలు తెలిపారు.

మీరు ఎవరనేది నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరో యూజర్ ఇది చిన్నపాటి గొప్ప విజయమని.. మీ సంకల్ప బలంతోనే ఇది మీకు సాధ్యమైందని చెప్పారు. ఇక మిగతా యూజర్లు కూడా చాలా మంది ఆ యువకుడిని పొగడ్తలతో ముంచేత్తేశారు. “మీ విజయం ఈ విధంగా జరుపుకోవడం, ఈ మధురక్షణాలను ఆదరించడం గొప్ప విషయమని” పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..