Viral Video: ఇదేగా కలికాలం.. బతికి ఉన్న పాముని తినేసిన కప్ప.. షాక్ తింటున్న నెటిజన్లు

పాములకు కప్పలు ఆహారం.. అందుకనే కప్పలను తినే పాములను చూస్తూ ఉంటాం. ఇది సహజం.. అయితే పాముని వేటాడి తినే కప్పని చూసి ఉండరు. అయితే ఇలాంటి ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూపిస్తుంది వైరల్ అవుతున్న ఒక వీడియో. దీనిలో కప్ప పామును మింగడం కనిపిస్తుంది. ఈ సంఘటన అడవి నిజయమలను మాత్రమే కాదు ఏకంగా సృష్టి నియమాలనే మార్చివేసింది. ఇదేగా కలికాలం అంటున్నారు కొందరు.

Viral Video: ఇదేగా కలికాలం.. బతికి ఉన్న పాముని తినేసిన కప్ప.. షాక్ తింటున్న నెటిజన్లు
Viral Video

Updated on: Oct 07, 2025 | 12:31 PM

సోషల్ మీడియాలో తరచుగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వీడియోలోని సన్నివేశాలు ప్రజలను నవ్విస్తాయి. మరికొన్ని మనసుని కదిలిస్తాయి. కొన్నిసార్లు.. వీడియోలను నమ్మడం కష్టం. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. బహుశా పాములు కప్పలతో సహా చిన్న జీవులను వేటాడి తినడం చూసి ఉంటారు. ఇది సహజం కూడా.. అయితే కప్ప పామును వేటాడటం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ఈ వీడియో ఒక షాకింగ్ దృశ్యాన్ని చూపిస్తుంది.

ఈ వీడియోలో కప్ప పామును సగం మింగేసిందని, దాని శరీరం సగం కప్ప నోటి నుంచి బయట వేలాడుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాము నోటి భాగం కప్ప కడుపులో ఉంది, తోక భాగం బయట ఉంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కప్ప బతికి ఉన్న పామును మింగింది. ఎందుకంటే పాము కప్పనోటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతోంది. కానీ కప్ప పట్టు చాలా బలంగా ఉంది. దీంతో కప్ప నోటి నుంచి పాము బయటకు రాలేకపోయింది. ఈ ప్రత్యేకమైన దృశ్యాన్ని తన కెమెరాలో రికార్డ్ చేస్తున్న వ్యక్తి కూడా కప్ప పామును మింగడం చూసి ఆశ్చర్యపోయాడు.

కప్ప పామును మింగింది
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TheeDarkCircle అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. కేవలం 29 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. వందలాది మంది దీన్ని లైక్ చేసి, రకరకాల స్పందనలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన తర్వాత కొందరు ఈ సంఘటనను “భయంకరమైనది” అని, మరికొందరు దీనిని “నమ్మశక్యం కానిది” అని అభివర్ణించారు. “ప్రకృతి ఆటలు ప్రత్యేకమైనవి; ఆహారం, వేటగాడి నిర్వచనం ప్రతిసారీ మారవచ్చు.” అని ఈ కప్ప కూడా జిమ్‌లో చేరినట్లు అనిపిస్తుంది అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చిన్నగా, బలహీనంగా కనిపించే జీవి శక్తివంతమైన వేటగాడిని ఎలా ఓడించిందో చూసి చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..