Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. పామును పాప్‌కార్న్‌లా కరకరా నమిలి తిన్న కప్ప..

ఈ దృశ్యాలను చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు.. అవునండీ.. ఓ కప్ప పామును అమాంతం మింగి తినేసిందంటే మీరు నమ్ముతారా...? ఈ ఘటన కర్నాటకలో జరిగిందండి.. కప్ప ఎంత ఆకలితో ఉందో ఏమో కానీ.. ఇలా వింతగా ప్రవర్తించింది ...

Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. పామును పాప్‌కార్న్‌లా కరకరా నమిలి తిన్న కప్ప..
Frog Eats Snake

Updated on: Oct 24, 2025 | 3:23 PM

రోజులు మారుతున్నాయ్.. టెక్నాలజీ అప్ డేట్ అవుతుంది. అదే విధంగా ప్రకృతిలో వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఒక రేర్ ఇన్సిడెంట్ మీ ముందుకు తీసుకొచ్చాం. పాములు కప్పలను వేటాడి తినడం చాలా సాధారణం. పాములకు చాలా ఇష్టమైన ఫుడ్ కూడా కప్పలే అంటుంటారు. మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. పల్లెటూరులో ఉండేవాళ్లు అయితే నేరుగా కూడా చూసి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక కప్ప ఓ మాదిరి సైజ్‌ ఉన్న పామును పాప్ కార్న్‌లా కరకరా నమిలి మింగేసింది. ఈ వింత ఘటన కర్నాటకలో వెలుగుచూసింది.

చిక్‌మగళూరు జిల్లాలోని కలస తాలూకాలో ఒక కప్ప తనకంటే పెద్ద పామును మింగి అందరినీ ఆశ్చర్యపరిచింది. కలస తాలూకాలోని మావినకెరె సమీపంలోని హండిగోడు గ్రామంలోని పూర్ణచంద్ర ఇంటి సమీపంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. ఒక చిన్న కప్ప ఆ పామును పట్టుకుని మింగడానికి ప్రయత్నించింది. కప్ప పామును తల నుంచి మింగడం ప్రారంభించింది. పాము సగ భాగాన్ని మింగిన తర్వాత, దానిని పూర్తిగా తినడానికి ఇబ్బంది పడింది. చివరకు పామును వదలకుండా పూర్తిగా మింగేసింది. ఒక చిన్న కప్ప తన పరిమాణం కంటే పెద్ద పామును మింగిన ఈ వింత దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రకృతిలో జరిగిన ఈ అరుదైన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది ఓల్డ్ వీడియో అని మరికొందరు చెబుతున్నారు.

వీడియో దిగువన చూడండి….