Wedding Gift: కొత్తజంటకు గిఫ్ట్‌ని అందంగా అలంకరించి మరీ తీసుకుని వెళ్లిన ఫ్రెండ్స్.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే నవ్వులు..

|

Dec 08, 2021 | 6:46 PM

Wedding Gift: ప్రస్తుతం ప్రస్తుతం భారతదేశంలో పెళ్లి సీజన్ కొనసాగుతుంది. దీంతో వివాహ వేడుకల్లోని ఫన్నీ వీడియోలు నెట్టింట్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రతిరోజూ రకరకాల వధూవరుల..

Wedding Gift: కొత్తజంటకు గిఫ్ట్‌ని అందంగా అలంకరించి మరీ తీసుకుని వెళ్లిన ఫ్రెండ్స్.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే నవ్వులు..
Wedding Gift
Follow us on

Wedding Gift: ప్రస్తుతం ప్రస్తుతం భారతదేశంలో పెళ్లి సీజన్ కొనసాగుతుంది. దీంతో వివాహ వేడుకల్లోని ఫన్నీ వీడియోలు నెట్టింట్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రతిరోజూ రకరకాల వధూవరుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పెళ్ళిలో స్నేహితుల సందడి వీడియో  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  వరుడి స్నేహితులు ..  వివాహ రిసెప్షన్ సందర్భంగా కొత్త జంట కోసం ఓ భారీ బహుమతిని తీసుకుని వచ్చారు. ఈ వీడియో  ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. వరుడి స్నేహితులు చాలా మంది పూలతో అలంకరించిన ఒక భారీ పెట్టెను గిఫ్ట్ గా ఇవ్వడం కోసం ఎంతో  కష్టంగా మోసుకుంటూ.. వధూవరులున్న వేదికపైకి తీసుకుని వెళ్లారు. ఎంతో కష్టపడి ఆ పెద్ద బహుమతిని స్నేహితులు కొత్త జంట దగ్గరకు తీసుకుని వెళ్లారు. అనంతరం  ఆ పెట్టెను  కొత్త జంట చేతిలో పెట్టి.. అందరూ కలిసి ఆ గిఫ్ట్ ని  చిత్రాలకు కూడా పోజులిచ్చారు. అలా ఆ గిఫ్ట్ ని తీసుకుని వెళ్తున్న సమయంలో ఓ ఫేమస్ సాంగ్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయింది.

అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఇంతమంది స్నేహితులు కష్టపడి మోసుకుని వెళ్లి.. కొత్తజంటకు ఇచ్చిన ఈ భారీ గిప్ట్ బాక్స్ లో ఏమీలేదు. ఉత్త ఖాళీ పెట్టి.. స్నేహితులు అందరూ కలిసి చేసిన చిలిపి పని. వధూవరులు ఆ బహుమతి అందుకున్న తర్వాత ఫోటో తీసుకున్న వెంటనే దానిని అక్కడే తేలికగా విడిచి పెట్టడంతో పాటు.. అందరూ వేదికపై పగలబడి నవ్వారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్‌కో అనే ఖాతాదారుడు  ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు, ఈ వీడియోకు 82,000 కంటే వ్యూస్ ను , 5,500 లైక్స్ ను సొంతం చేసుకుంది.  మీరు కూడా ఆ భారీ గిఫ్ట్ పై ఓ లుక్ వేయండి మరి..

 

Also Read:  సంచలనం రేకెత్తించి తుస్సుమన్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్..