మంచు కురిసే వేళలో… హిమాచల్ ప్రదేశ్ అందాలు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని పలుప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. రాష్ట్రంలోని స్పిటి, లాహౌల్, సిమ్లా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తుంది. తండి గ్రామంలో కురుస్తున్న మంచు వర్షానికి.. గ్రామంలో జనజీవనం స్థంభించిపోయింది. గ్రామం మొత్తాన్ని మంచుదుప్పటి కప్పేసింది. చెట్లు, రోడ్లు పూర్తిగా మంచుతో కప్పబడి మంచువనంలా కనిపిస్తుంది. మంచు చరియలు గ్రామంపై విరుచుకుపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమీప ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు ముందస్తు చర్యలకు దిగారు. మంచు ప్రభావిత […]

మంచు కురిసే వేళలో... హిమాచల్ ప్రదేశ్ అందాలు

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:38 PM

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని పలుప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. రాష్ట్రంలోని స్పిటి, లాహౌల్, సిమ్లా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తుంది. తండి గ్రామంలో కురుస్తున్న మంచు వర్షానికి.. గ్రామంలో జనజీవనం స్థంభించిపోయింది. గ్రామం మొత్తాన్ని మంచుదుప్పటి కప్పేసింది. చెట్లు, రోడ్లు పూర్తిగా మంచుతో కప్పబడి మంచువనంలా కనిపిస్తుంది. మంచు చరియలు గ్రామంపై విరుచుకుపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమీప ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు ముందస్తు చర్యలకు దిగారు. మంచు ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తండి గ్రామంపైకి పొడిమంచు సునామిని తలపించేలా గ్రామంవైపు దూసుకొస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us