ప్రస్తుతం అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దాంతో నగరంతోపాటు పల్లెల్లో చిరుతపులులు, ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అడవి జంతువుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా, మానవ, జంతువుల ఆవాసాల మధ్య దూరం నేడు తగ్గుతోంది. పలు ప్రాంతాల నుంచి గ్రామంలో పులులు, చిరుతలు,ఎలుగుబంట్లు సంచరిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి ప్రమాదకరమైన జంతువులు ఇంట్లోకి ప్రవేశించి మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తున్నాయి. దీంతో అటవీ సమీపంలోని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒకటి రెండు కాదు.. ఏకంగా చిరుత ఫ్యామిలియే సిబ్బంది క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.
ఈ వీడియో X (గతంలో Twitter) హ్యాండిల్ @aniltalwar2లో షేర్ చేయబడింది. దానితో పాటు, ఖమీరియా, జబల్‌పూర్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో 10 గంటలకు అని క్యాప్షన్ ఉంది. ఈ ఘటన జబల్‌పూర్‌లో చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీడియోలో, నాలుగు చిరుతలు గేటు దగ్గరికి వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా కెమెరాతో వీడియోలో రికార్డ్ చేస్తున్న వ్యక్తిని చిరుతపులి చూసింది. దాంతో అది కూడా భయపడింది. ఆ వెంటనే గేటు నుండి దూకి పారిపోయింది. అయితే మిగిలిన మూడు చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపటి తర్వాత మరో రెండు చిరుతలు గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి దూకివెళ్లిపోయాయి.. కానీ ఒక చిరుతపులి గేటు పైన కూర్చొని ఉంది. కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత దూకేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.. ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.
Last night at10pm,Staff quarters Ordnance Factory, Khamaria, Jabalpur. pic.twitter.com/cM51vk0S3S
— Anil Talwar🇮🇳 (@aniltalwar2) March 6, 2024
ఈ వీడియోపై ప్రజలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంట్రీకి ముందు అవి ఐ-కార్డ్ చెక్ చేయలేదని ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు. వావ్! చిరుతపులి కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. మరో వినియోగదారు స్పందిస్తూ..ఈ వీడియో జబల్‌పూర్‌కి చెందినది కాదని, మహారాష్ట్రలోని చంద్రపూర్ సెక్టార్ 6కి చెందినదని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..