Snake in Train: రన్నింగ్ ట్రైన్‌లో కనిపించిన అనుకోని అతిథి.. ఒక్కసారిగా పరుగులు తీసిన ప్రయాణీకులు

|

Jul 28, 2022 | 9:11 PM

ఎస్‌ 5 కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులందరిని ఖాళీ చేయించి.. పాములు పట్టే ఇద్దరు వ్యక్తులను రప్పించి వెతికించారు. అయితే ఆ పాము కనిపించలేదు.

Snake in Train: రన్నింగ్ ట్రైన్‌లో కనిపించిన అనుకోని అతిథి.. ఒక్కసారిగా పరుగులు తీసిన ప్రయాణీకులు
Snake In Train
Follow us on

Snake in Train: రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. ప్రయాణికులంతా అరుపులు కేకలు వేస్తూ రైల్లో నానా రచ్చ చేశారు. కొందరు పామును కొట్టి చంపేయాలని అరుస్తుంటే, మరికొందరు కాదు, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించాలని కోరారు. ఇలా వేగంగా వెళ్తోన్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పాము హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

బుధవారం రాత్రి తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్‌ 5 కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులకు పాము కనిపించింది. దాంతో వారి టీటీకి ఫిర్యాదు చేశారు. రైలు తిరుర్ స్టేషన్ దాటిన తర్వాత బెర్త్‌ కింద ఉన్న లగేజ్‌ వద్ద పాము కనిపించిందని ప్రయాణికులు తెలిపారు. మొబైల్‌లో తీసిన పాము ఫొటో కూడా చూపించారు. సమాచారం అందుకున్న కోజికోడ్ రైల్వే స్టేషన్‌ అధికారులు రాత్రి 10.15 గంటలకు రైలును ఆ స్టేషన్‌లో నిలిపివేశారు.

ఎస్‌ 5 కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులందరిని ఖాళీ చేయించి.. పాములు పట్టే ఇద్దరు వ్యక్తులను రప్పించి వెతికించారు. అయితే ఆ పాము కనిపించలేదు. కంపార్ట్‌లోని హోల్‌ ద్వారా అది వెళ్లిపోయి ఉండవచ్చు లేదా అక్కడ దాగి ఉండవచ్చని అన్నారు. అయితే పాము ఫొటోను చూసిన సిబ్బంది అది అంత ప్రమాదం కాదని తెలిపారు. అనంతరం ఆ హోల్‌ను మూసివేశారు. అర్ధ రాత్రి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి