సింహం, పులి, చిరుత లాంటి అడవి జంతువులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటికి ఇతర జంతువులే కాదు.. మనుషులు దొరికినా ప్రాణాపాయాన్ని ఎదుర్కోక తప్పదు. ఇక ఈ జంతువులతో.. మొసళ్లు కూడా తక్కువేమి కాదు. సముద్రపు అలెగ్జాండర్‌గా మొసలిని అభివర్ణిస్తారు. ఇవి మనిషిపై దాడి చేస్తే.. బ్రతకడం కష్టమే. అటు భూమి.. ఇటు నీరు రెండింట్లోనూ నివసించగలిగే ఉభయచరాలు ఈ మొసళ్లు. అత్యంత ప్రమాదకరమైన ఈ మొసలికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియోను మీరూ చూసినట్లయితే.. కచ్చితంగా గుండె గుభేల్ అంటుంది.
ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లాడేస్ నేషనల్ పార్క్‌లో ఎంచక్కా సేద తీరుతున్న కత్రినా బాయ్చెవ్ అనే మహిళకు ఊహించని సీన్ ఎదురైంది. ఓ సరస్సులో కొండచిలువ, మొసలి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. అందులో సముద్రపు అలెగ్జాండరైన మొసలి.. పైథాన్‌ను చంపి.. తినేసింది.
చచ్చిన ఆ పైథాన్ కళేబరాన్ని తింటూ ఆ మొసలి.. ఈ మహిళ కంటపడింది. ఇక దాన్ని వీడియో తీసి.. నెట్టింట షేర్ చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ చూసేయ్యండి.