Droupadi Murmu: ‘మేడమ్ ప్రెసిడెంట్’.. ఈ ఫోటోలో ద్రౌపది ముర్మును గుర్తుపట్టగలరా.? అంత ఈజీ కాదండోయ్

|

Jul 25, 2022 | 1:23 PM

ఇండియాకు 15వ రాష్ట్రపతిగా, 'మేడమ్ ప్రెసిడెంట్'గా జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముర్ము.

Droupadi Murmu: మేడమ్ ప్రెసిడెంట్.. ఈ ఫోటోలో ద్రౌపది ముర్మును గుర్తుపట్టగలరా.? అంత ఈజీ కాదండోయ్
Droupadi Murmu
Follow us on

ఇండియాకు 15వ రాష్ట్రపతిగా, ‘మేడమ్ ప్రెసిడెంట్’గా జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముర్ము. గిరిజన మహిళగా.. వార్డు కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ద్రౌపది ముర్ము.. ప్రస్తుతం రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించనున్నారు. ఆమె జీవితం ఎందరికో ఇన్‌స్పిరేషన్. ఇదిలా ఉంటే.. ప్రజలు ఆమె గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

ఈ తరుణంలో ఆమె ఓల్డ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ద్రౌపది ముర్ము కాలేజ్ డేస్‌ ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. అందులో ద్రౌపది ముర్ము ఎక్కడున్నారో కనుక్కోండి అంటూ మిగతావారికి సవాల్ విసురుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా మీ ఐ పవర్‌ను టెస్ట్ చేయండి.. ఆమె ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.