Viral Video: వరదలో కొట్టుకుపోతున్న పులిని రక్షించిన ఏనుగు..! చివర్లో భారీ ట్విస్ట్

వరదల్లో కొట్టుకుపోతున్న పులిని ఏనుగు కాపాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మిగతా జంతువులను వేటాడే పులి, పాపం ఆకులు, పండ్లు తినే ఏనుగు మధ్య ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు.

Viral Video: వరదలో కొట్టుకుపోతున్న పులిని రక్షించిన ఏనుగు..! చివర్లో భారీ ట్విస్ట్
Elephant Tiger Viral Video

Updated on: Jul 10, 2026 | 4:35 PM

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వరదలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో అత్యంత ఎక్కువగా షేర్ అవుతున్న వీడియోల్లో ఇదీ ఒకటి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోతున్న పులిని ఒక ఏనుగు కాపాడుతున్నట్లు చూపించే క్లిప్. జంతువుల మధ్య ఫ్రెండ్‌షిప్ అంటూ నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. దాంతో ఇది కాస్త వైరల్ అయింది.

వీడియోలో వరద ప్రవాహంలో చిక్కుకున్న పులి వైపు ఏనుగు నీటిలో నడుచుకుంటూ వెళ్లి దానిని రక్షించినట్లు కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని “సుమత్రాలో ఆకస్మిక వరదల సమయంలో చోటుచేసుకున్న అరుదైన, హృదయాన్ని కదిలించే ఘటన”గా పేర్కొంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ వీడియోను తాజాగా జరిగిన సంఘటనగా కూడా పలువురు షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పూర్తి స్థాయిలో చెక్ చేయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైరల్ అవుతున్న ఈ ఫుటేజ్ నిజమైనది కాదని, ఇది పూర్తిగా AI సాయంతో రూపొందించిన వీడియో అని ఫ్యాక్ట్ చెకర్లు స్పష్టం చేశారు.

వీడియో చూడండి

వీడియోను పరిశీలించిన నిపుణులు ఇందులో అనేక అసహజ లక్షణాలను గుర్తించారు. వరద నీరు సహజంగా ప్రవహిస్తున్నట్లు కాకుండా అసాధారణంగా నునుపుగా కనిపించడం, ఫ్రేమ్ మొత్తం మితిమీరిన మెరుపుతో ఉండడం, జంతువుల కదలికల్లో సహజత్వం లేకపోవడం వంటి అంశాలు AI వీడియోలకు సాధారణంగా కనిపించే లోపాలని వెల్లడించారు. ముఖ్యంగా పులి కదులుతున్న సమయంలో దాని శరీరంపై ఉన్న చారలు అస్పష్టంగా మారడం, ఆకృతి సహజంగా లేకపోవడం కూడా AI రూపొందించిన దృశ్యాలకు నిదర్శనంగా గుర్తించారు. డిటెక్షన్ సాఫ్ట్‌వేర్ విశ్లేషణలో ఈ వీడియో 93.7 శాతం వరకు AIతో రూపొందించినట్లు తేలింది. ఈ విషయాన్ని ఇండోనేషియా మీడియా సంస్థ Tempo.co తన ఫ్యాక్ట్ చెక్‌లో పేర్కొంది. ఇతర AI గుర్తింపు సాధనాలు కూడా ఇదే తరహా ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడించింది. పైగా ఈ వీడియో ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు.. 2025 నవంబర్‌లోనే ఇది ఇంటర్నెట్‌లో కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us