Facebook Name Change: ప్రపంచంలో సగానికిపైగా జనాభా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు మొదలు ముసలి వాళ్ల వరకు అందరూ ఫేస్‌బుక్‌లో అకౌంట్ కలిగి ఉన్నారు. తమ అభిప్రాయాలను, తమ అభిరుచులను పంచుకునేందేకు దీనిని ఒక సాధనంగా వినియోగిస్తున్నారు. చాలామంది ప్రజలు ఫేస్‌బుక్‌లో నిరంతరం యాక్టీవ్‌గా ఉంటారు. ఇంతలా పాపులర్ అయ్యింది ఫేస్‌బుక్. అయితే, ఈ ‘ఫేస్‌బుక్’కి సంబంధించి తాజాగా కీలక వార్త ప్రచారంలో ఉంది. రీ-బ్రాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని, ఫేస్‌బుక్ పేరును మారుస్తున్నట్లు విపరీతరంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నెటిజన్లు ఒక రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. దాదాపు 17 సంవత్సరాలుగా ‘ఫేస్‌బుక్’ పేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇలాంటి ఫేస్‌బుక్ పేరు మారుస్తున్నారని తెలిసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీమ్స్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఫేస్‌బుక్ పని అయిపోయిందని, రిప్(రెస్ట్ ఇన్ పీస్) అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చూసినా ఇదే వరుస కనిపిస్తోంది.
The Facebook memes have begun. pic.twitter.com/Y4KpiPDRAx
— G.R.S. Jackson (@GRSJacksonReal) October 20, 2021
ఇదిలఉంటే.. ఫేస్ బుక్ పేరుతో త్వరలోనే మారబోతోందని, దీనికి సంబంధించి వివరాలను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ వెల్లడిస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రాబోయే వారంలో ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో కొత్త పేరును ప్రకటిచంనున్నారట. అక్టోబర్ 28వ తేదీన ఫేస్‌బుక్ కాన్ఫరెన్స్ జరుగబోతోందని, ఈ కాన్ఫరెన్స్‌లో జూకర్‌బర్గ్ ఫేస్‌బుక్ కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది అంటూ ది వెర్జ్‌లో పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రమ్ మూడూ కలిపి ఒక యూనిట్‌గా పేరెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Facebook: “If I change my name, the regulators won’t be able to see me.” pic.twitter.com/E9zt7Pb0Yf
— Azeem Azhar (@azeem) October 20, 2021
Facebook changing from Facebook to The Facebook pic.twitter.com/hciFA311MA
— Lit Palm (@litpalmbot) October 20, 2021
Also read:
Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..