చనిపోయిన మగపాము, కన్నీరు మున్నీరవుతున్న ఆడపాము.. గుండె తరుక్కుపోయే వీడియో

ప్రమాదవశాత్తు ఒక ఏనుగు చనిపోయినప్పుడు ఆ ఏనుగుల మంద మొత్తం అక్కడికి చేరుకుంటుంది. ఏనుగు మృతికి మనుషులు కారణమైతే అవి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తుంటాయి. అయితే, మీరు ఎప్పుడైన పాములు చనిపోతే మిగతా పాములు రోధించే సంఘటన చూశారా..? అవును అలాంటి సీన్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మగపాము చనిపోవటంతో, దాని జత ఆడపాము తీవ్రంగా రోధిస్తుంది.

చనిపోయిన మగపాము, కన్నీరు మున్నీరవుతున్న ఆడపాము.. గుండె తరుక్కుపోయే వీడియో
death of the snake the female snake remained sitting

Updated on: Sep 08, 2025 | 7:35 PM

సాధారణంగా మనుషులు చనిపోతే కుటుంబీకులు, బంధుమిత్రులు చుట్టూ చేరి రోధిస్తుంటారు. అలాగే, కొన్ని జాతుల జంతువుల్లో కూడా ఇలాంటి విషాద సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఒక కోతి చనిపోతే దాని చుట్టూ అనేక వానరాలు చేరి గోల గోల చేస్తాయి. వాటి దుఃఖాన్ని అవి ఇలా వెళ్లగక్కుంటాయి. అలాగే, ఒక కాకి చనిపోయినా కూడా కాకులన్నీ చేరి అరుపులతో గోల చేస్తాయి. అలాగే, అడవి జంతువులు కూడా ఇలాగే చేస్తుంటాయి. అప్పుడప్పుడు ఏనుగుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ప్రమాదవశాత్తు ఒక ఏనుగు చనిపోయినప్పుడు ఆ ఏనుగుల మంద మొత్తం అక్కడికి చేరుకుంటుంది.

ఏనుగు మృతికి మనుషులు కారణమైతే అవి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తుంటాయి. అయితే, మీరు ఎప్పుడైన పాములు చనిపోతే మిగతా పాములు రోధించే సంఘటన చూశారా..? అవును అలాంటి సీన్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మగపాము చనిపోవటంతో, దాని జత ఆడపాము తీవ్రంగా రోధిస్తుంది. వీడియోలోకి వెళితే..

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌లోని శివపురి నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక పామును JCB యంత్రం నలిపివేసింది. ఆ తర్వాత ఆడ పాము ఒకటి ఆ చనిపోయిన పాము దగ్గర కూర్చుని గంటల తరబడి రోదిస్తుంది. ఆడ పాము ప్రాణములేని పాము దగ్గర కదలకుండా గంటల తరబడి కూర్చుంది. ఈ మగ, ఆడ పాము జంట దాదాపు 17 సంవత్సరాలుగా కలిసి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. దీనిని చూసిన ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. తీవ్ర ఆవేదనతో కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..