దేవుడు సృష్టించిన మానవుడి శరీర నిర్మాణం నేటికీ ఎవరికీ అర్ధం కాదు. ఓ వైపు అర్ధం అయినట్లు ఉంటూనే ఉంటుంది.. మరోవైపు ఇదిగో దీని రహస్యం కనిపెట్టు అంటూ ప్రకృతి సవాల్ విసురుతోంది. ఇంకా చెప్పాలంటే మానవ శరీరం అంతర్గత పనితీరు చాలా క్లిష్టంగా ఉంటుంది. మానవులే కాదు వైద్యులు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే నేటికీ రకరకాల వ్యాధులు సైన్స్ కు అందని మిస్టరీగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ వింత వ్యాధి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక అమ్మాయి వింత వ్యాధితో పూర్తిగా ఇంట్లో బంధించుకుని జీవిస్తోంది.
అరుదైన జబ్బులు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులకు చికిత్స సాధ్యం కాదు అందుకే ఆ వ్యాధుల గురించి మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ప్రస్తుతం అలాంటి వ్యాధి ఒకటి ప్రజల్లో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలిస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. అమీ ఫ్రాన్సిస్ స్మిత్ అనే అమ్మాయికి ఉన్న ఉన్న వింత వ్యాధి గురించి తెలుసుకుందాం.. ఈ అమ్మాయికి ప్రజలు సాధారణంగా ఆనందించే అన్నీ అలెర్జీనే..
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఇంగ్లాండ్ కు చెందిన ఓ యువతి తన విచిత్రమైన పరిస్థితిని వివరిస్తూ.. తనకు చాలా వస్తువులు అలర్జీని కలిగిస్తాయని పేర్కొన్నాడు. వాటి గురించి ఆలోచించడం వల్ల ఒకొక్కసారి మానసిక అనారోగ్యానికి గురవుతానని కూడా వెల్లడించింది. ఒక ఇంటర్వ్యూలో 2015 నుండి తనకు అలెర్జీ ఉన్నట్లు తెలిసిందని.. అప్పటి నుంచి తాను జీవితాన్ని గడపడం కష్టంగా మారిందని చెప్పింది. ఈ అనారోగ్యం కారణంగా నేను ఏమీ తినలేను, ఎక్కడికీ వెళ్లలేనని ఆవేదన వ్యక్తం చేసింది.
డాక్టర్ చెప్పిన ప్రకారం ఇంగ్లాండ్‌కు చెందిన ఈ అమ్మాయికి మొదట టమోటాలు, వేరుశెనగలు తింటే అలెర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని తరువాత ఈ అలెర్జీ బ్రెడ్, పండ్లు, ధాన్యాలకు పెరగడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత కార్బోనేటేడ్ వాటర్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎయిర్ ఫ్రెషనర్, వేడి, చలికి అలెర్జీకి గురి అవ్వడం మొదలయ్యింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి నాలుగు రకాలు మాత్రమే తినే స్టేజ్ కు చేరుకుంది. ఈ నాలుగు రకాల వస్తువులు స్పెషల్ మాంసం, సొరకాయ, వంకాయ, బియ్యం మాత్రమే.. అయితే కేవలం ఈ నాలుగు వస్తువులు మాత్రమే తినడం వలన ఆ బాలిక ఇప్పుడు పోషకాహార లోపం బారిన పడింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..