Shocking Video: ఏనుగులు చాలా తెలివైన జంతువులు. ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే.. ఎవరైనా వారిని ఇబ్బంది పెడితే.. మాత్రం అస్సలు ఒప్పుకోవు. వెంటాడి మరి బుద్ధిచెబుతుంటాయి. అందుకే.. ఏనుగులను ఎల్లప్పుడూ ప్రేమగా చూసుకోవాలి. వాటిని ఎప్పుడూ కూడా ఆటపట్టించకూడదు, వేధించకూడదంటారు జంతు ప్రేమికులు. ముఖ్యంగా అవి సంచరించే ప్రదేశాల్లో ఏనుగులకు చికాకు తెప్పించకూడదని.. ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అడవిలో సంచరిస్తున్న కొన్ని ఏనుగులు.. తమ సమీపంలోకి పర్యాటకులు రావడం చూసి ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యాయి. వెంటనే పర్యాటకులపై దాడి చేయడం మొదలుపెట్టాయి. అయితే.. అప్పుడేం జరిగిందో చూసి అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుధా రామెన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి వీడియోతో పాటు అతను క్యాప్షన్ కూడా రాశారు. ఏనుగులు సంచరిస్తున్న క్రమంలో మనం వాటిని వేధించకూడదంటూ పేర్కొన్నారు. జంతువులకు వారి సొంత స్థలం ఉంటుందన్న విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. ఈ వీడియోలో ఏనుగులు చాలా దూరంగా కనిపించడాన్ని మనం చూడవచ్చు. అక్కడ కొంతమంది పర్యాటకులు వాటి ముందు కారులో కనిపిస్తున్నారు. అయితే.. తన దగ్గరికి వస్తున్న టూరిస్ట్ కారుని చూసిన వెంటనే.. ఓ ఏనుగు కోపంతో కారు వైపు పరుగెత్తడం ప్రారంభించింది. ఆ ఏనుగుతోపాటు.. అకస్మాత్తుగా చాలా ఏనుగులు కూడా కారు వైపు కదలడం ప్రారంభించాయి. ఏనుగు కారు దగ్గరికి వచ్చిరాగానే ఒక్కసారిగా కారును నెట్టుకుంటూ వెళ్తుంది. దీంతో వాహనం బోల్తా పడుతుంది. వెంటనే టూరిస్టులంతా ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు.
వైరల్ వీడియో..
The least we can do is to leave them undisturbed atleast in their home range.
Animals do have their personal space. Respect pls.
(Video received on WA) pic.twitter.com/tHTel5HhY1— Sudha Ramen ?? (@SudhaRamenIFS) December 1, 2021
Also Read: