దుఃఖాన్ని, హృదయ విదారకాన్ని అనుభవించేది కేవలం మనుషులే కాదు. ఈ భావోద్వేగాలు జాతుల సరిహద్దును అధిగమించాయి. అలాంటి హృదయ విదారక ఘట్టం తాజాగా కెమెరాకు చిక్కింది. శోకంలో ఉన్న తల్లి ఏనుగు చనిపోయిన తన బిడ్డను బ్రతికించేందుకు ప్రయత్నిస్తున్న ఘటన అందరినీ కలచివేసింది. జంతువులు తమ పిల్లల పట్ల చాలా సున్నితంగా ఉంటాయి. దీనికి సంబంధించిన అన్ని ఉదాహరణలను మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అందులో కోతి నుండి ఏనుగు, కుక్క,చిరుత వరకు తమ బిడ్డను అన్ని విధాలుగా సురక్షితంగా ఉంచుతాయి.. దీంతో పాటు వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాయి.. కానీ ఈ మూగజీవాల పిల్లలకు ఏదైనా జరిగితే, అవి నిస్సహాయంగా ప్రవర్తిస్తాయి..ఉదాహరణకు ఒక ఏనుగు పిల్ల గొయ్యిలో పడినా, లేదంటే దాని ఆరోగ్యం క్షీణించినా దాని తల్లి తల్లడిల్లిపోతుంది. ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఆ మూగజీవి తన బిడ్డను కాపాడుకోటం కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఆ జంతువుకు తెలిసిన అన్ని మార్గాలన్నీ అనుసరిస్తుంది. అలాంటి భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోను IFS అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో (@susantananda3) షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌లో.. ఇది చూడగానే నా గుండె పగిలిపోయింది. ఏనుగు పిల్ల చనిపోయింది. ఈ విషయం తెలియక ఆ తల్లి ఏనుగు చిన్నారికి అనారోగ్యంగా భావించి 2 కి.మీ. దూరం మోసుకెళ్లింది. ఆ ఏనుగు పిల్లపై నీళ్లు పడితే బహుశా బతికి వస్తుందేమో అనే ఆశతో నీళ్లలో పడవేసింది. తిరిగి గున్న ఏనుగు బతుకుతుందనే ఆశతో ప్రయత్నించింది. ఏనుగు పిల్ల మంద నుండి తప్పి 3 రోజుల క్రితం మరణించింది. కానీ తల్లి తన దూడను వదలలేదు. దానిని ఎత్తుకుని 2 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లి నది నీటిలో పడేసి ప్రాణం పోసేందుకు ప్రయత్నించింది. ఈ హృదయ విదారక సంఘటన గోరేశ్వర్‌లో జరిగిందని తెలిసింది.
జూన్ 15 న పోస్ట్ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో రెండు ఏనుగులు అడవి మధ్యలో నిలబడి ఉండటం కనిపించింది. వాటి ముందు సన్నటి నీటి ధార ప్రవహిస్తోంది. దాని మధ్యలో ఒక చిన్న ఏనుగు పిల్ల పడి ఉంది. ఏనుగు తన తొండంతో చెట్టు ఆకులను తెంపుతూ ఆ పిల్ల ఏనుగు మీద కింద పడేలా చేస్తుంది. చూస్తుంటే ఈ తల్లి ఏనుగు తీవ్ర మనస్తాపానికి గురైందని తెలుస్తుంది. తన బిడ్డను పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆ గున్న ఏనుగు ఏ మాత్రం కదలకుండా పడివుంది. ఇది చూసిన గజరాజు చాలా నిరుత్సాహానికి గురవుతాడు.
That is why they are called as sentient beings. Elephants are known to carry their dead members, especially calves. They don’t want to leave them behind. I have seen personally seen such cases. This heartbreaking incident took place in Goreswar, Assam. pic.twitter.com/w2Zi9wPucs
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 16, 2023
ఈ వీడియో చూసిన వారి గుండె తరుక్కుపోయింది. ఇప్పటికే ఈ వీడియోకి 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో చాలా మందికి లైక్ చేసారు. ఇది కాకుండా, వినియోగదారులు దానిపై తీవ్రంగా స్పందించారు.. ఒకరు హార్ట్ బ్రోకెన్ అంటే, మరొకరు హార్ట్ టచింగ్ అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..