Elephant Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా, ఓ ఏనుగు.. అచ్చం మనుషుల్లానే పోకిరి పనిచేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇది చూసి నెటిజన్లు.. ఈ ఏనుగు అచ్చం మా లాగానే ఉందంటూ పేర్కొంటున్నారు. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు భీభత్సం సృష్టిస్తుంటాయి. అడవులు అంతరిస్తుండటంతో.. తిండి కోసం సమీప ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. కొన్ని సార్లు ఏనుగులు కోపంతో ఆస్థులకు నష్టం కలిగిస్తాయి. మరికొన్ని సార్లు మనుషులపై దాడులు చేస్తుంటాయి. తాజాగా.. ఓ ఏనుగు కూడా రాత్రివేళ భీభత్సం సృష్టించింది. అయితే.. ఇక్కడ కోపంతో ఉన్న ఏనుగు పోతూ పోతూ పోకిరి పని చేసి పోయింది.
అస్సాంలోని తేజ్‌పూర్ పట్టణానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఏనుగు గత రాత్రి అడవి నుంచి తప్పిపోయి వచ్చి తేజ్‌పూర్ వీధుల్లో హల్‌చల్ చేస్తూ తిరిగింది. సమీపంలోని భవనాల నివాసితులు ఈ ఏనుగు దృశ్యాలను చిత్రీకరించారు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. ఏనుగు కోపంతో పోతుంటుంది. ఈ సమయంలో దాన్ని చూసి ప్రజలంతా పరుగులు తీశారు. ఈ సమయంలో ఏనుగు రోడ్డు పక్కన ఆపి ఉంచిన బైక్‌ను.. సినిమా స్టైల్ తన్ని పడగొడుతుంది.. బైక్‌ను తన్నిన తర్వాత అంది ముందుకు వెళుతుంది.
వీడియో చూడండి..
Don’t park in no parking zone. Original owner of the land enforcing traffic rules at night.
VC:NDTV pic.twitter.com/F1UGg9N43Z— Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..