అత్యంత విశ్వసనీయమైన జంతువుగా జంతువుగా కుక్కలకు పేరుంది. అంతే కాదు చాలా తెలివైనవిగా చెప్పవచ్చు. వాసనతోనే పసిగట్టేస్తుంటాయి. దొంగ ఎవరో..? దొర ఎవరో ఇట్టే చెప్పేస్తుంటాయి. కానీ కొన్నిసార్లు మనుషులు కూడా అర్థం చేసుకోవడంలో పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో కుక్క లు తప్పు చేయవు అనేది నిజం. అయితే ఓ కుక్క పెద్ద పొరపాటు చేసింది. అది చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా అదే అంటారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో కనిపించినది సాదారణ పాము అని అనుకున్నది. కాని అది ఓ చేప. అది కూడా చాలా ప్రమాదకరమైనది. దానిని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నించిన కుక్కకు అదేంటో తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఈ ఘటన కాస్తా వీడియోకు చిక్కింది. ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో పాములాంటి చేప కనిపించడం వీడియోలో చూడవచ్చు. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కుక్క దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కాసేపు అరిచింది.. కాని అది కదలకపోవడంతో దాని తోకను పట్టుకనేందుకు ప్రయత్నించింది. కుక్క తన నోటిలో చేపలను పట్టుకున్న వెంటనే.. దానికి భారీ షాక్ తగలినట్లుగా ఊగిపోయింది. నిజానికి కుక్క నోటితో పట్టుకున్నది పాము కాదు ఓ చేప.. అది మామూలు చేప కాదు, ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్. ఆ వీడియోను మీరు ఇక్కడ చూడండి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి:
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను నెటిజన్లు ఎంతగానో లైక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 85 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు. అదే సమయంలో, వేలాది మంది వీడియోను కూడా లైక్ చేసారు. కామెంట్ సెక్షన్‌లో మిశ్రమ స్పందనలు లభిస్తోంది. కొంతమంది ఈ వీడియోను ఫన్నీగా పరిగణిస్తున్నారు. అదే సమయంలో, కొంతమంది జంతు ప్రేమికులు కుక్కపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్ షేర్లు..
Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..
Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..