Viral Video: నేటి యువతకు ఆదర్శం ఈ వృద్ధదంపతులు.. జీవన పోరాటం రూ.10 లకు పోహా అమ్మకం..

Viral Video: కొంతమంది యువకులు బతకడానికి అవకాశాలు, ఉద్యోగాలు లేవంటూ సాకులు వెదుకుతారు. అయితే అటువంటి బద్దకస్తులకు ఉదాహరణ ఈ వృద్ధ దంపతులు.  వీధుల్లో కేవలం..

Viral Video: నేటి యువతకు ఆదర్శం ఈ వృద్ధదంపతులు.. జీవన పోరాటం రూ.10 లకు పోహా అమ్మకం..
Elderly Couple

Updated on: Dec 08, 2021 | 9:37 PM

Viral Video: కొంతమంది యువకులు బతకడానికి అవకాశాలు, ఉద్యోగాలు లేవంటూ సాకులు వెదుకుతారు. అయితే అటువంటి బద్దకస్తులకు ఉదాహరణ ఈ వృద్ధ దంపతులు.  వీధుల్లో కేవలం 10 రూపాయలకే పోహా విక్రయిస్తున్న వృద్ధ దంపతుల హృదయాన్ని కదిలించే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నాగ్‌పూర్‌లోని తాండపేటలోని పండిట్ నెహ్రూ కాన్వెంట్ ఎదురుగా సప్తజాతీయ దంపతులు స్నాక్స్ విక్రయిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఫుడ్ బ్లాగర్ ద్వయం వివేక్, అయేషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ క్లిప్ వైరల్‌గా మారింది, అనేక మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

ఈ వృద్ధ దంపతులు రూ. 10కి పోహా, రూ. 15కి ఆలూ బోండా అమ్ముతున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆహారాన్ని సిద్ధం చేసి, ఉదయం 6 గంటలకు తమ స్టాల్‌ను తెరుస్తామని తాత గారు చెప్పారు. మరోవైపు భర్త కు బామ్మ సంతోషంగా సహాయం చేస్తోంది. చిరునవ్వుతో పోహా చేస్తోంది. తమకు సొంత ఇల్లు లేదని.. అద్దె, ఇతర ఖర్చులు చెల్లించడంతో పాటు.. తమ జీవనోపాధికి ఇలా పనిచేయడం తప్పనిసరని చెప్పింది బామ్మ. ఈ వృద్ధ దంపతుల ఆత్మ విశ్వాసం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

“ఈ 70 ఏళ్ల దంపతులు జీవనోపాధి కోసం పోహా అమ్మడం ప్రారంభించారు. కేవలం రూ. 10 లకే పోహా అమ్ముతున్నారు.  గత 4 సంవత్సరాలుగా ఈ చిన్న స్టాల్‌ ను నడుపుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది. 57వేలకు పైగా వ్యూస్మ, కొన్ని వేల కామెంట్స్ సొంతం చేసుకుంది. మరికొందరు ఈ వృద్ధ దంపతులు ఎక్కడ స్టాల్ ను పెట్టుకుని అమ్మతున్నారో అడ్రస్ అడుగుతున్నారు.

Also Read:

సంచలనం రేకెత్తించి తుస్సుమన్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్..

  రాష్ట్రానికి మంత్రి.. నిరాడంబరంగా ఒక్కగానొక్క కూతురు పెళ్లి.. ఆదర్శంగా నిలిచిన నేత

Follow Us