Viral: ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టకుండానే ఇంటికొచ్చిన పార్శిళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా

ఈ రోజుల్లో పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే చాలు.. వారు దానిని సులభంగా ఆపరేట్ చేసేస్తున్నారు. ఇదిగో ఒక అబ్బాయి తన తల్లి మొబైల్ ఫోన్ నుంచి లాలీపాప్ ఆర్డర్ చేశాడు. అవును, సరిగ్గా 70,000 లాలీపాప్‌లు ఆర్డర్ పెట్టాడు. ధర తెలిస్తే తల తిరుగుతుంది.

Viral: ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టకుండానే ఇంటికొచ్చిన పార్శిళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
Trending 1

Updated on: May 14, 2025 | 8:27 PM

పిల్లలు చాక్లెట్లు అంటే భలేగా ఇష్టం. సహజంగానే ఎక్కడికెళ్ళినా చాక్లెట్లు కావాలని మారాం చేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం తనకు నచ్చిన చాక్లెట్లను.. తల్లికి తెలియకుండా ఆన్‌లైన్‌లో తనకు కావలసినంత ఆర్డర్ పెట్టుకున్నాడు. అవునండీ.! అమెరికాలోని 8 ఏళ్ల బాలుడు అమెజాన్‌లో 70,000 లాలీపాప్‌లను ఆర్డర్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీటి ధర దాదాపు 3.3 లక్షలు ఉంటుందట. ఈ విషయాన్ని ఆ బాలుడి తల్లి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన బిడ్డ తనకు తెలియకుండా ఆన్‌లైన్‌లో లాలీపాప్‌లు ఆర్డర్ పెట్టాడని.. తన క్రెడిట్ కార్డు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్ అయ్యాయని మెసేజ్ వస్తేనే గానీ తనకు అసలు విషయం తెలియలేదని తల్లి తెలిపింది. అంతేకాకుండా లాలీపాప్‌ల బాక్సులు తలుపు వద్దకు రాగా.. తన కొడుకు లాలీపాప్‌లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినట్టు తెలిసింది. ఏకంగా 22 లాలీపాప్‌ల పెట్టెలు ఇంటికి చేరుకున్నాయి. ఇంకా 8 లాలిపాప్ పెట్టెలు రావాల్సి ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

వీటికి తన క్రెడిట్ కార్డు నుంచి రూ. 3.3 లక్షలు కట్ అయ్యాయి. ఇంకా డెలివరీ చేయాల్సిన 8 పెట్టెలను తిరిగి తీసుకోమని అమెజాన్‌ను అడగ్గా.. దానికి వాళ్లు నిరాకరించారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నా పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చి లక్షలాది డాలర్లు కోల్పోయాను” అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది.