మేకప్‌ లేకుండా భార్యను చూసి షాకైన భర్త.. భార్య తనను మోసం చేసిందంటూ.. విడాకుల కోసం కోర్టుకు..

|

Nov 07, 2021 | 9:58 AM

Egyptian man divorces wife: ఫేస్‌బుక్‌లో ఇద్దరు పరిచమయ్యారు. అనంతరం స్నేహం కాస్త ప్రేమ వరకు దారితీసింది. అనంతరం ఆమెను లైవ్‌ చూసి.. అందానికి ఫిదా అయిపోయాడు. మంచిగా

మేకప్‌ లేకుండా భార్యను చూసి షాకైన భర్త.. భార్య తనను మోసం చేసిందంటూ.. విడాకుల కోసం కోర్టుకు..
Egyptian Man Divorces Wife
Follow us on

Egyptian man divorces wife: ఫేస్‌బుక్‌లో ఇద్దరు పరిచమయ్యారు. అనంతరం స్నేహం కాస్త ప్రేమ వరకు దారితీసింది. అనంతరం ఆమెను లైవ్‌ చూసి.. అందానికి ఫిదా అయిపోయాడు. మంచిగా ఉందని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఓ రోజు.. ఆమె వాష్ రూమ్‌ నుంచి వస్తుండటంతో చూసి షాకయ్యాడు. అందంగా లేదని విడాకులిచ్చాడు. ఈ షాకింగ్‌ సంఘటన యూనైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగింది. ఈజిప్టు దేశానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివాసముంటున్నాడు. అతనినికి ఫేస్‌బుక్ లో ఓ యువతి పరిచయం కాగా.. ఇద్దరు నిత్యం చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి నచ్చడంతో ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమె అందానికి ఫిదా అయిపోయిన అతను.. ప్రపోజ్‌ చేశాడు. ఇద్దరు కలిసి పలుమార్లు డేటింగ్‌కు సైతం వెళ్లారు. అనంతరం ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. పెళ్లయిన తరువాత రెండు మూడు రోజులకు ఇద్దరు షార్జాలోని అల్ మమ్‌జార్ బీచ్‌లో స్నానం చేశారు. దీంతో ఆమె మేకప్ కరిగిపోయింది. ఈ సమయంలో భార్యను చూసి షాక్ అయ్యాడు. ఇంతకాలం అందంగా ఉండటానికి మేకపే కారణమని తెలుసుకున్నాడు.

తన భార్య అందంగా లేదని.. ఇంతకాలం ఆమె మేకప్‌తో మేనెజ్‌ చేసిందని భర్త తెలిపాడు. తనకు ఆమె వద్దంటూ విడాకులు కోసం ఫ్యామిలీ కోర్టులో డైవర్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ చేపట్టిన కోర్టు అతని నుంచి సమాధానం కోరింది. పెళ్లికి ముందు ఆమె మేకప్ వేసుకుందని.. మేకప్ లేకుండా ఆమెను చూసి షాక్ అయ్యానని.. కానీ ఆమెతో కలిసి ఉండటానికి నెల రోజులుగా ప్రయత్నిస్తున్నానని కానీ ఆమెతో కలిసి జీవించటం కష్టమని భర్త కోర్టుకు తెలిపాడు. తనకు విడాకులు ఇప్పించండీ అంటూ కోర్టుకు ప్రాధేయపడ్డాడు. భర్త మాటలు విన్న ఆమె కుమిలిపోయింది. అందమేమీ శాశ్వతం కాదంటూ ఆమె ప్రశ్నించింది. ఎప్పుడూ మేక్‌ప్‌తో కూడిన ఫొటోలనే పోస్ట్‌ చేసేదని.. చివరకు మోసపోయానని భర్త కోర్టుకు తెలిపాడు.

చివరకు కౌన్సెలింగ్ ఇచ్చిన కోర్టు.. ఆమెతో ఏడాది పాటూ ఉండాలని భర్తకు సూచించింది. ఇద్దరూ.. సర్దుకుపోవాలని.. అలా కుదరకపోతే విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయినా భర్త ససేమిరా అనడంతో.. కోర్టు విచారణను వాయిదా వేసింది.

Also Read:

India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

PPF: మీ పిల్లల భవిష్యత్ కోసం కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టండి.. లక్షల్లో రాబడి పొందండి.. దీనిపై టాక్స్ కూడా ఉండదు!