సమయాభావం! రోజుకు 24 గంటలు ఫిక్స్ కాదండీ బాబూ!

భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం మార్పుతో, కొన్ని రోజుల్లో 24 గంటల కంటే స్వల్పంగా తక్కువ సమయం నమోదవుతుంది. జూలై 9, 22, ఆగస్టు 5 వంటి రోజులు తక్కువ పొడవైన రోజులు గా రికార్డు అయ్యాయి. భూమి-చంద్రుడి దూరం, వాతావరణ మార్పులు, సముద్రపు ఆటుపోట్లు వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి.

సమయాభావం!  రోజుకు 24 గంటలు ఫిక్స్ కాదండీ బాబూ!
Earth Rotation

Updated on: Oct 09, 2025 | 6:20 PM

రోజుకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లు. ఇది ఇప్పటిదాకా ఉన్న పక్కా లెక్క. ఇకపై ఇది మారబోతోందా? మన వాల్‌క్లాక్‌లో చిన్నముల్లు, పెద్దముల్లు గమనంలో కూడా తేడాలొస్తే? అంత సినిమా లేకపోవచ్చు గానీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమింగ్స్‌ మాత్రం స్వల్పంగా మారే ఛాన్సుంది. దీనికి మూల కారణం ఏంటంటే, మన కాలికింద నేల కదలికల్లో తేడాలు రావడం. ఎస్.. సూర్యునిచుట్టూ భూగ్రహం తిరిగే వేగం అనూహ్యంగా మారుతోంది. దాంతోపాటే కాలచక్రంలో చిన్నచిన్న సవరణలు తప్పనిసరి ఔతున్నాయి.

ఇక్కడో విషయాన్ని రీకాల్ చేసుకోవాలి. ఈ ఏడాది జూలై 9 బుధవారం.. ఇంతవరకూ రికార్డయిన అత్యంత చిన్న రోజు. అదే నెల 22, ఆగస్టు 5 కూడా కురచ దినాలుగా రికార్డులకెక్కాయి. అంటే ఆ రోజుల్లో సమయం 24 గంటల కంటే తక్కువన్నమాట. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది.. భూమికీ, గడియారానికి లింకేంటి? ఆ డీటేల్స్ అన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం…

భూమి సూర్యునిచుట్టూ తన కక్ష్యపై ఒకసారి పూర్తిగా తిరగడానికి పట్టే సమయం 86 వేల 400 సెకన్లు. అంటే 24 గంటలు.. దాన్నే ఒక రోజుగా పరిగణిస్తాం. కానీ, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు భూమికి ఎంతదూరంలో ఉన్నాయనే దానిపైనే గురుత్వాకర్షణ శక్తి పెరగడం, తగ్గడం జరుగుతుంది. గ్రావిటేషనల్ పవర్‌ని బట్టే కదా భూమి కదిలే వేగం మారుతుంది!. భూమి తిరిగే స్పీడ్‌లో అప్పుడప్పుడూ మార్పులు జరుగుతాయ్. వాటి ఆధారంగానే ఆ రోజు సైజు ఎంతన్నది డిసైడౌతుంది. భూమి వేగం పెరిగితే సమయం తగ్గడం, వేగం తగ్గితే సమయం పెరగడం జరుగుతుంది.

ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా.. జూలై 9.. షార్టెస్ట్ డే అని. మిగతా రోజుల కంటే ఆ రోజుల్లో సమయం ఒకటిన్నర మిల్లీ సెకన్లు తక్కువగా నమోదైనట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇకపై ఇలా తరచూ జరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు.

భూమికీ- చంద్రుడికీ మధ్య దూరం పెరగడానికీ, దాని కారణంగా భూమి తిరిగే వేగం మారడానికి కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. వాతావరణ పీడనంలో మార్పులు, సముద్రపు ఆటుపోట్లు, మంచు కరగడం, భూమి అంతర్గత కదలికలు.. ఇవన్నీ భూమి కదిలే వేగాన్ని చేసేవే.

ఇలా భూమి వేగంతో పాటు సమయంలో జరిగే స్వల్పమార్పులతో కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయి. 24 గంటల టైమ్‌ఫ్రేమ్ ఆధారంగా పనిచేసే వ్యవస్థలన్నిటినీ మార్చుకోక తప్పదు. ముఖ్యంగా, జీపీఎస్ టెక్నాలజీపై ప్రభావం చూపొచ్చు. స్టాండర్డ్ టైమింగ్స్‌ మీద డిపెండయ్యే స్టాక్ మార్కెట్లు లాంటి కొన్ని కీలక ఆర్థిక వ్యవస్థలు కూడా స్వల్పంగా ప్రభావితమౌతాయ్. కానీ, బేఫికర్ అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే, సాధారణ ప్రజలకు దీంతో పెద్దగా ఆందోళన అవసరం లేదు. డే టు డే లైఫ్‌ మీద దీని ప్రభావం తక్కువేనట.

కాలికింద నేల కదులుతోందన్న భావన కూడా మనకు తెలీదు కదా…! అటువంటప్పుడు భూమి తిరిగే వేగం మారుతోందన్న సెన్స్ గురించి, దాని ప్రభావం గురించి పట్టించుకోనవసరం లేదు. ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రెఫరెన్స్ సిస్టమ్ – IERS.. నిరంతరం భూమి గమనాన్ని లెక్కపెడుతూనే ఉంటుంది. వాళ్లిచ్చే డేటా ప్రకారం కాలమానాలు కూడా వాటంతటవే మారిపోయేలా అత్యంత ఆధునిక సాంకేతికత మన దగ్గరుంది. సో… ఈ పరిణామాలన్నీ మనకు తెలీకుండానే జరిగిపోతాయ్. మన 24 గంటలూ సేఫ్ అన్నమాట.