
జంతు ప్రపంచంలో డేగ, పాము రెండూ చాకచక్యంగా శక్తివంతమైన వేటగాళ్లుగా పరిగణిస్తారు. అడవిలో ఈ రెండు జీవుల మధ్య తరచుగా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. పై చేయి సాధించేందుకు 2 జీవులు హోరాహోరీగా పోట్టాడతాయి. కొన్నిసార్లు డేగ తన అధిక వేగంతో పామును బంధించి విజయం సాధింస్తుంది. పాము తన తెలివితేటలు, బలంతో డేగను ఓడిస్తుంది. అలాంటి ఒక సంఘటన ఇటీవల కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ డేగ పామును తొక్కిపట్టి.. దాన్ని తన ముక్కుతో పొడుస్తూ ఉండటంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. చూస్తే.. పాము జీవితం ఇక ముగిసినట్లే అనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలయింది. డేగ పామును చూట్టారా చుట్టుకుని.. ఉక్కిరి బిక్కి చేసి కింద పడేసింది. పాము ఎంత వ్యూహం, ఓపికతో డేగను కుదేలు చేసిందో దిగువన వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. పాము పట్టు ఎంత గట్టిగా మారిందంటే డేగ తనను తాను విడిపించుకోలేకపోతుంది. వేటాడాలనే ఉద్దేశ్యంతో వచ్చిన డేగ.. నేలకరిచి ఓటమి చవిచూసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @AMAZlNGNATURE అనే ఖాతా నుంచి ఈ వీడియో షేర్ చేశారు. వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. వేలాది మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఒకరిని బలహీనంగా భావించి ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు” అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.
వీడియో దిగువన చూడండి..
What lesson did you learn from this? pic.twitter.com/czLfwTPO6h
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 20, 2024