Viral Video: పామును డేగ వేటాడడం ఎప్పుడైనా చూశారా.? వామ్మో ఇంత క్రూరంగా ఉంటుందా..

|

Oct 01, 2023 | 7:03 PM

అలాంటి వేటల్లో పాటు, డేగలది ఒకటి. ఆకాశంలో ఎక్కడో ఎగిరే డేగా, నేలపై ఎక్కడో పాకుతూ వెళ్లే పామును అమాంతం పట్టేసుకోవడం నిజంగానే వింత కదూ. అయితే ఇది అంత సింపుల్‌గా జరిగే విషయం కాదు. డేగ ఇందుకోసం ఎంతో ఎదురు చూస్తుంది. మనిషి చూపు కంటే నాలుగు రెట్లు తీక్షణంగా ఉంటుంది డేగ చూపు. అందుకే ఎక్కడో ఉన్న పామును పట్టేసుకుని, తినేస్తుంది. అయితే విష పాములను సైతం డేగలు...

Viral Video: పామును డేగ వేటాడడం ఎప్పుడైనా చూశారా.? వామ్మో ఇంత క్రూరంగా ఉంటుందా..
Eagle Snake Fight Video
Follow us on

‘ఒక జీవి బతకాలంటే.. మరో జీవి చావాల్సిందే’.. ప్రకృతి నైజం ఇదే. ఒక జీవికి ఆకలేస్తే మరో జీవి ఆయువు తీరాలని చెబుతుంటారు. ఇలా ఒక జీవి బతకడానికి మరో జీవిపై పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది నిత్యం కొనసాగే ప్రక్రియ. ఇలా జీవించడానికి ఒక్కో జీవి ఒక్కో మార్గాన్ని వెతుక్కుంటుంది. మనుషులు తెలివితో ఆహారాన్ని తయారు చేసుకుంటే జంతువులు వేటాను మార్గంగా ఎంచుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వేట చాలా భయకంరంగా ఉంటుంది.

అలాంటి వేటల్లో పాటు, డేగలది ఒకటి. ఆకాశంలో ఎక్కడో ఎగిరే డేగా, నేలపై ఎక్కడో పాకుతూ వెళ్లే పామును అమాంతం పట్టేసుకోవడం నిజంగానే వింత కదూ. అయితే ఇది అంత సింపుల్‌గా జరిగే విషయం కాదు. డేగ ఇందుకోసం ఎంతో ఎదురు చూస్తుంది. మనిషి చూపు కంటే నాలుగు రెట్లు తీక్షణంగా ఉంటుంది డేగ చూపు. అందుకే ఎక్కడో ఉన్న పామును పట్టేసుకుని, తినేస్తుంది. అయితే విష పాములను సైతం డేగలు చీల్చి చెండాడుతాయి. ఇలాంటి సంఘటనలను స్వయంగా చూడడం అంత సులభమైన విషయం కాదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి టెక్నాలజీ ఆధారంగా అన్ని సాధ్యమవుతున్నాయి.

హై డెవినేషన్‌తో కూడిన కెమెరాలు అందుబాటులోకి రావడం, సోషల్‌ మీడియా కారణంగా ఇలాంటి వీడియోలు ఎన్నో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ డేగ ఆకాశంలో విహరిస్తోంది. అదే సమయంలో నేలపై ఓ పాము నెమ్మదిగా వెళ్తోంది. దానిని గమనించిన డేగా అమాంతం నేలపైకి వచ్చి పామును పట్టేసుకొని ఎగిరింది.

వైరల్ వీడియో..

అనంతరం ఓ చెట్టు కొమ్మపై పామును ఉంచి దానిని చంపేందుకు ప్రయత్నించింది. అయితే పాము ఏమాత్రం తగ్గకుండా డేగపై రివర్స్‌ అటాక్‌ చేసేందుకు ప్రయత్నించింది. డేగా ఎంతో టెక్నిక్‌తో ఒక కాలితో పాము తలను పట్టేసింది. నోటితో గట్టిగా కరిచి చివరికి పామును మట్టి కడిపేసింది. దీనంతటినీ రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. డేగ వేట ఇంత భయంకరంగా ఉంటుందా.? అంటు కామెంట్స్‌ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..