మనిషి మరణానికి చేరువయ్యేసరికి కొన్ని తీరని కోరికలుంటాయి , ఆ కోరికలను అడిగి మరీ తీర్చుకుంటారు చాలామంది.. కొందరు ఇష్టమైన వాళ్లని చూడాలనుకుంటారు, ఇంకొంతమంది వారసులకు తమ ఆస్తులను పంచి పెడుతుంటారు.. కానీ, అమెరికాకి చెందిన నార్బర్ట్ స్కెమ్ అనే వ్యక్తి తన చిలిపి చివరికోరికను తీర్చుకొని వార్తల్లోకి ఎక్కాడు..
87 ఏళ్ల నార్బర్ట్ స్కెమ్ గత కొన్నాళ్లుగా కొలొన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.. డాక్టర్ల ప్రయత్నాలు కూడా ఏం పనిచేయకపోవడంతో నార్బర్ట్ ఇక తాను బ్రతకనని తెలుసుకున్నాడు..ఈ చివరిక్షణాల్లో ఏం కావాలి నాన్నా అని నలుగురు కొడుకులు అడగ్గానే అందరం కలిసి సరదాగా బీర్ తాగుదాం అనేశాడు.. అంతే క్షణాల్లో అందరి చేతిల్లో బీర్ బాటిల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఎంతో ఆనందంతో నవ్వుతున్న నార్బర్ట్ చివరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఈ ఫొటో తీసుకున్న కొన్ని గంటలకే నార్బర్ట్ కన్నుమూశాడు. అయినప్పటికీ ఈ ఫొటో ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోయిందంటూ నార్బర్ట్ వారసులు అంటున్నారు.. చావు ఎవరికైనా వస్తుంది, కానీ దానికి ఎదురు వెళ్లి నవ్వుకుంటూ ఆహ్వానించేవాడే గొప్పోడు అని సినిమాల్లో చెప్పినట్టు నార్బర్ట్ కూడా చాలా గ్రేటే అని నెటిజన్లు అంటున్నారు.
My grandfather passed away today.
Last night all he wanted to do was to have one last beer with his sons. pic.twitter.com/6FnCGtG9zW
— Adam Schemm (@AdamSchemm) November 21, 2019