Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ స్కాన్ చేస్తుండగా.. తత్తరపాటుకు గురైన వ్యక్తి.. అనుమానమొచ్చి చెక్ చేయగా షాక్.!

|

Aug 01, 2022 | 8:40 PM

అది ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సుమారు ఉదయం 11.30 కావొస్తోంది..

Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ స్కాన్ చేస్తుండగా.. తత్తరపాటుకు గురైన వ్యక్తి.. అనుమానమొచ్చి చెక్ చేయగా షాక్.!
Airport Scanning
Follow us on

అది ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సుమారు ఉదయం 11.30 కావొస్తోంది. దుబాయ్ వెళ్లే ఫ్లైట్‌ ఎక్కేవారి కోసం ఫైనల్ కాల్ ఇచ్చారు. ఇక లగేజ్ స్కానింగ్ జరుగుతున్న దగ్గర ఓ వ్యక్తి కదలికలు పోలీసులకు కాస్త అనుమానస్పదంగా కనిపించాయి. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పరంజీత్ అనే వ్యక్తి దుబాయ్ ఫ్లైట్ చెక్ చేసేందుకు వెళ్తుండగా.. లగేజ్ స్కాన్ చేస్తున్న దగ్గర అతడి కదలికలు పోలీసులకు కాస్త అనుమానం కలిగించాయి. దీంతో సదరు వ్యక్తిని పక్కకు తప్పించి.. అతడి లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు మరో చెక్ పాయింట్ దగ్గరకు తీసుకెళ్లారు అధికారులు. ఎక్స్‌రే స్కాన్ చేస్తుండగా.. అతడి బ్యాగ్‌లోని ఓ సైడ్ అరలో 2,62,500 సౌదీ రియల్(సుమారు రూ. 60 లక్షలు) విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. ఇక వాటికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో.. పరంజీత్‌ను అదుపులోకి తీసుకుని.. ఆ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..