Dog Yoga – viral video: కొన్ని జంతువులు అచ్చం మనిషి లాగానే ప్రవర్తిస్తుంటాయి. మనుషులు ఏం చేస్తే అవి చేస్తూ ఆకట్టుకుంటాయి. దీంతోపాటు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంటాయి. విశ్వాసం అని పేరు వినిపిస్తే చాలు మనందరికీ శునకం గుర్తుకు వస్తుంది. కుక్క మనుషుల నుంచి చాలా నేర్చుకుంటూ.. నమ్మితే వెన్నంటే ఉంటూ కాపాడుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భంగా కుక్కలు చేసే పనులు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. వాటికి అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తూ ఔరా.. అనిపించుకుంటాయి. తాజాగా ఓ కుక్క యోగా చేస్తూ కనిపించింది. అచ్చం మనిషిలాగానే యోగాసనాలు వేసింది. ఈ వీడియోను చూసినవారంతా నోరెళ్లబెడుతూ కుక్కను తెగ మెచ్చుకుంటున్నారు.
ఈ మీడియోలో ఓ యువతి యోగా చేస్తుంది. ఆమె వెంట ఉన్న కుక్క కూడా ఆ యువతి ఏం చేస్తే అలా చేస్తుంది. ముందు ఆయువతి మ్యాట్‌ను వేస్తుంది. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా యోగాసనాలు వేస్తుంది. అచ్చం ఆ యువతి ఎలా చేస్తుందో కుక్క కూడా అలానే ఆసనాలు వేస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించండి.
Also Read: