Viral Video: అడ్డా నాది.. గడ్డా నాది.. పారిపో.. సోషల్ మీడియాలో గ్రామం సింహం సందడి..

పార్క్ ప్రాంతంలో అమర్చిన అద్దంలో తనను తాను చూసుకోవడం.. పరుగులు పెట్టడం మనం ఈ వీడియోలు చూడచ్చు. అందులో తనను తాను చూసుకుని..

Viral Video: అడ్డా నాది.. గడ్డా నాది.. పారిపో.. సోషల్ మీడియాలో గ్రామం సింహం సందడి..
Dog Was Scared Of Himself I

Updated on: Apr 10, 2022 | 5:11 PM

ఈ మధ్య జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసేందుకు నెటిజనం తెగ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్(Viral Video) అవుతున్నాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం వ్యక్తం చేసేవి మాత్రమే కాకుండా సంతోషం వ్యక్తం చేసేవి కూడా ఇందులో ఉంటున్నాయి. ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కుక్క చేసే సరదా వీడియో ఒకటి సామాజిక మాద్యామాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోలో ఓ కుక్క అటు.. ఇటు పరుగులు పెట్టడం మనం చూడవచ్చు. అడ్డా నాది.. గడ్డా నాది.. అంటూ బుజ్జి గ్రామ సింహం సందడి అంతా ఇంతాకాదు. పార్క్ ప్రాంతంలో అమర్చిన అద్దంలో తనను తాను చూసుకోవడం.. పరుగులు పెట్టడం మనం ఈ వీడియోలు చూడచ్చు. అందులో తనను తాను చూసుకుని ఆశ్చర్యపోతుంది. అద్దంలో కనిపించేది మరో కుక్క అనుకుని అటు.. ఇటు పరుగులు పెడుతుంది.

అద్దంలో కనిపించిన కుక్కను చూసి బిగ్గరగా మొరిగిపోతుంది, దానిని తరిమికొట్టడానికి అద్దం వెనుకకు వెళుతుంది. దీని తర్వాత, అతను మళ్లీ అద్దం ముందుకి వచ్చి మళ్లీ తనపై తానే మొరగడం కనిపిస్తుంది. మరోసారి కుక్క అద్దం వెనుకకు వెళ్లి అవతలి కుక్కను చూసింది. అదే సమయంలో, అతను ఇతర కుక్కను పొందకపోవడంతో చాలా విచారంగా కనిపిస్తుంది.

ఈ వీడియో అన్ని సోషల్ మీడియాల్లో తెగ షేర్ అవుతోంది. అంతేకాదు చాలా నెటిజన్లు లైక్ చేయడమే కాదు కామెంట్స్ కూడా చేస్తున్నారు. వార్తలు రాసే సమయానికి సోషల్ మీడియాలో ఈ వీడియోకి 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయం.. విదేశాంగ మంత్రిగా జుల్ఫికర్ అలీ భుట్టో మనవడు..